ANDHRA PRADES MNINISTER KODALI NANI SLAMS TDP CHIEF CHANDRABABU NAIDU AND MLA NANDAMURI BALA KRISHNA OVER CRITICISM ON GOVERNMENT FULL DETAILS HERE PRN
Kodali Nani: శని దోష నివారణకు మంత్రి కొడాలి నాని కొత్త ఐడియా...
మంత్రి కొడాలి నాని (ఫైల్ ఫోటో)
మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయా వైరం ముదురుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party).., ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయా వైరం ముదురుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.., ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టిన దెబ్బకు చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయిందని.. ఆయనకు మైండి చెడిపోయిన విషయం అందరికీ తెలుసని విమర్శించారు. చంద్రబాబు ఒక శనిగ్రహం అని, ఈ విషయం ఎన్టీయార్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. శని దోషాలు వదలాలంటే చంద్రబాబు ఫోటో పెట్టుకొని పూజలు చేస్తే సరిపోతుందంటూ తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టు తిరుగుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు మోదీని ప్రశ్నించలేక సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.
ఇక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపైనా కొడాలి నాని కౌంటర్స్ వేశారు. బాలకృష్ణ చిన్నపిల్లాడని.., ఆటలో అరటిపండు లాంటివాడని ఎద్దేవా చేశారు. సినిమా షూటింగుల కోసం ఇతర దేశాల్లో తిరుగుతారని.. పాటలకు మలేషియా, ఫైటింగులకు హాంకాంగ్ ఇలా దేశాలుపట్టుకొని తిరిగే వ్యక్తికి రాష్ట్రంలోని పరిస్థితులు ఏం తెలుస్తాయన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటివాడంటూ కొడాలి నాని పంచులు విసిరారు.
ఐతే కొడాలి నాని మాటలు బాలకృష్ణకు చేరాయో ఏమోగానీ.., హిందూపురం పర్యటన సందర్భంగా బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంలోని నలుగురు మంత్రులను కేవలం చంద్రబాబు నాయుడుని విమర్శించడం కోసమే పెట్టుకున్నారన్నారు. సీఎం జగన్ ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రికి అప్పగించారన్న బాలయ్య... చంద్రబాబును బూతులు తిట్టేందుకు ఒక మంత్రిని నియమించారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని... అందుకే ఎన్నికల్లో పోలీసులు, వాలంటీర్లత ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.