SEC vs YSRCP: అలా చేస్తే ఇంట్లో కూర్చోబెడతా... ఆ పార్టీ నేతలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ వార్నింగ్

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల (Andhra Pradesh Panchayat Elections) నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కడప జిల్లాలో (Kadapa District) పర్యటిస్తున్న ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, ఏక్రీవాలతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం, వైఎస్ మృతి తర్వాత సీబీఐ కేసుల అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారంతోనే తాను ఎన్నికలు నిర్వహిస్తున్నానే తప్ప మరో కారణం లేదన్నారు. అలాగే ఎన్నికలు నిర్వహిచకుంటా ఆఫీసులో కూర్చుంటే ఎలా అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం చెప్పిన పని చేస్తుంటే కొందరు ప్రభుత్వ పెద్దలు తానేదో తప్పు చేస్తున్నట్లు విమర్శిస్తున్నారన్నారు. అంతేకాదు పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

    ఇంట్లో కూర్చోబెడతా..!
    పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ, లోక్ సభకు పోటీ లేకుండా చేయగలమా..? అసెంబ్లీకి పోటీ కావాలి. లోక్ సభకు పోటీ కావాలి.. పంచాయతీలకు పోటీ అవసరం లేదంటే ఎలా నమ్ముతాం..? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరిగిననట్లు పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేస్తే సరికాదని.., కగ్రీవాల కోసం మీటింగులు పెట్టి ప్రకటనలు చేసే వారిని ఇంట్లో కూర్చోబెడతామని హెచ్చరించారు.

    వైఎస్ తో అనుబంధం
    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధముందన్నారు. ఆయన హయాంలో ఆర్ధిక శాఖ కార్యదర్శిగా అకాశమిచ్చారు. నిజాలు నిర్భయంగా మాట్లాడే అవకాశం ఆయన కల్పించారన్నారు. వైఎస్ఆర్ ఆశీర్వాదం వల్లే.., రాజ్ భవన్ తనకు ఎస్ఈసీ పదవి ఇచ్చిందని నమ్ముతున్నానన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు కూడా నిర్భయంగా మాట్లాడుతున్నానని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

    సీబీఐ కేసుల్లో నేనే సాక్షి
    ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల గురించి నిమ్మగడ్డ పరోక్షంగా ప్రస్తావించారు. వైఎస్ మరణానంతరం నమోదైన సీబీఐ కేసుల్లో తాను కూడా సాక్షిగా ఉన్నట్లు ఎస్ఈసీ గుర్తు చేశారు. ఆయా కేసుల్లో కోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్భయంగా సాక్ష్యం చెప్తానన్నారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. ఐతే ఎన్నికల డ్యూటీ మీద వెళ్లిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. సీఎం సొంత జిల్లాలో సీబీఐ కేసుల ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published: