కేసీఆర్‌ను కించపరుస్తూ టిక్‌టాక్ వీడియో.. ఆంధ్రా యువకుడి అరెస్ట్

నవీన్ రూపొందించిన టిక్‌టాక్ వీడియో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా.. శత్రుత్వాన్ని పెంచేలా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ తెలిపారు. ఏప్రిల్ 14న ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు చెప్పారు.

news18-telugu
Updated: April 25, 2019, 11:08 AM IST
కేసీఆర్‌ను కించపరుస్తూ టిక్‌టాక్ వీడియో.. ఆంధ్రా యువకుడి అరెస్ట్
తెలంగాణ సీఎం కేసీఆర్.. (Photo: facebook)
  • Share this:
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ టిక్‌టాక్ వీడియో రూపొందించిన ఓ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడిని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరుకి చెందిన తగరం నవీన్‌(20)గా గుర్తించారు. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్న నవీన్.. నగర శివారులో అద్దె నివాసంలో ఉంటున్నట్టు సమాచారం.

నవీన్ రూపొందించిన టిక్‌టాక్ వీడియో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా.. శత్రుత్వాన్ని పెంచేలా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ తెలిపారు. ఏప్రిల్ 14న ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు చెప్పారు. అరెస్ట్ సమయంలో నవీన్ వద్ద నుంచి రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు వి. రామనరసింహ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు.

First published: April 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు