KTR-Suma: మంత్రి కేటీఆర్‌ను కలిసిన యాంకర్ సుమ.. సూపర్ అంటూ ప్రశంసలు

మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫొటోలను ట్విటర్, ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ను సుమ కలవడం.. హైదరాబాద్ గురించి చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: November 21, 2020, 3:02 PM IST
KTR-Suma: మంత్రి కేటీఆర్‌ను కలిసిన యాంకర్ సుమ.. సూపర్ అంటూ ప్రశంసలు
యాంకర్ సుమతో మంత్రి కేటీఆర్
  • Share this:
ప్రముఖ యాంకర్ సుమ కనకాల మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఆయనతో సంభాషించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. గడగడా మాట్లాడే తనను.. ఆయన నాయకత్వం శద్ధగా వినేలా చేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఒక హైదరాబాదీగా మన సిటీ, దాని అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు యాంకర్ సుమ. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫొటోలను ట్విటర్, ఇన్‌స్టగ్రామ్‌లో షేర్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ను సుమ కలవడం.. హైదరాబాద్ గురించి చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


‘'నేను షోలలో ఆపకుండా గడగడ మాట్లాడుతుంటా. కానీ మీ నాయకత్వం నన్ను శ్రద్ధగా వినేలా చేసింది. చెప్పిన వాటి కోసం అంకిత భావంతో పనిచేయడం, వాటిని అమలు చేయడం సూపర్బ్’' అని యాంకర్ సుమ ట్వీట్‌ చేశారు.



మీతో ఇంటరాక్షన్‌ను నేను ఎంజాయ్ చేశానని సుమ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు మంత్రి కేటీఆర్. మన సంభాషణను ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ను యాంకర్ సుమ కలవడం పట్ల ఎలాంటి రాజకీయ కారణాలు లేనట్లు తెలిసింది. ఆ ఫొటోలను బట్టి మంత్రి కేటీఆర్‌ను సుమ ఇంటర్వ్యూ చేసినట్లు స్పష్టమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే మంత్రిని ఆమె ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించినట్లు తెలిసింది.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading