Home /News /politics /

ANATHAPURAM COLLETCTOR GANDHAM CHANDRUDU VS DHARMAVARAM MLA KETHIREDDY ISSUE UPDATE NGS

Andhra Pradesh: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్యే కేతిరెడ్డి Vs కలెక్టర్ ఇష్యూలో ఆరని ఆగ్రహ జ్వాలలు

ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్సెస్ కలెక్టర్ గంధం చంద్రుడు

ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్సెస్ కలెక్టర్ గంధం చంద్రుడు

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి.. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి మధ్య వివాదం ఇప్పటిలో చల్లారేలా లేదు. వారిద్దరు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా.. ఓ వైపు దళిత సంఘాలు, మరోవైపు ఎమ్మెల్యే అభిమానులు ఢీ అండే ఢీ అంటున్నారు. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంకా చదవండి ...
    అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్‌ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా కొనసాగుతోంది. కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు దళిత సంఘాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా భారీగా దళితులు కేతిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిని దళిత సంఘాలు ముట్టడిస్తున్నాయని ముందే తెలియడంతో కేతి రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు..

    కేతిరెడ్డి ఇంటికి వెళ్తోన్న ఆందోళనకారులను ముందస్తుగానే అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కలెక్టర్ గంధం చంద్రుడు ఓ పండగ నిర్వహణపై ఆంక్షలు విధించడంతో కేతిరెడ్డి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను లెక్కచేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    సంప్రదాయల విషయంలో తలెత్తిన వివాదం అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడి జిల్లా కలెక్టర్‌ మధ్య సమస్యగా మారింది. ఇప్పుడా గొడవ ఇంకో మలుపు తీసుకుంది.

    ఓ చిన్న సాంప్రదాయం విషయంలో మొదలైన వివాదం ఇద్దరి మద్య ఆగాధంగా మారింది. చిల్లవారిపల్లిలోని కాటమయ్య స్వామి ఉత్సవం సందర్భంగా తలెత్తిన గొడవ వీరిద్దరి మధ్య గ్యాప్‌ తీసుకొచ్చింది. అసలు సమస్య ఎలా ఉన్నా.. సీన్‌లోకి ఎమ్మెల్యే ఎంట్రీ తర్వాత వివాదం ఇంకో మలుపు తిరిగింది. కలెక్టర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే ఉపయోగించిన పదజాలంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. కొత్త సమస్య తెరపైకి వచ్చింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాటమయ్య ఉత్సవంలో సంప్రదాయాల విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతునే ఉన్నాయి. రెండు గ్రామల మధ్య శాంతిభద్రతల సమస్యగా మారింది. కొందరు కోర్టు తలుపులు కూడా తట్టారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలపై రెండు వర్గాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీయొచ్చన్న అభిప్రాయంతో వేడుకల నిర్వహణ ఆపేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంమే అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. ఏకపక్షంగా ఉత్సవాలను ఆపేశారని కలెక్టర్‌ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా కేతిరెడ్డి ఉపయోగించిన పదజాలంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసనలు చేపట్టాయి.

    దళిత సంఘాల ఎంట్రీలో వివాదం మరో మలుపు తీసుకుంది. కాటమయ్య ఉత్సవ వివాదం పక్కకు వెళ్లి.. కొత్త సమస్య తెరపైకి వచ్చింది. తమ సామాజికవర్గానికి చెందిన కలెక్టర్‌ను దూషించారని దళిత వర్గాలు రోడ్డెక్కాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా మరికొందరు దళితులు ఎంట్రీ ఇవ్వడంతో పరస్పరం ఆరోపణలు హోరెత్తుతున్నాయి. దీంతో ఈ వివాదం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందో ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు. ఇద్దరికీ ప్రజల్లో మంచి పేరే ఉండడంతో ఎవరిది తప్పు అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌పై ముఖ్యమంత్రి కార్యాయలం కొంత సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సున్నితమైన ఇలాంటి అంశాలను టచ్‌ చేయొద్దని ఎమ్మెల్యే కేతిరెడ్డికి, కలెక్టర్‌ చంద్రుడికి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. వారిద్దిరి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా.. ఇతర వర్గాలు మాత్రం ఈ వివాదాన్ని వదిలేలా కనిపించడం లేదు.
    Published by:Nagesh Paina
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు