గ్రామ పంచాయతీకి వైసీపీ రంగు.. సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందుకు బాధ్యుడైన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్.ప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనాన్ని మళ్లీ వైట్ వాష్(తెల్ల సున్నం) చేయించారు.

news18-telugu
Updated: October 31, 2019, 9:00 AM IST
గ్రామ పంచాయతీకి వైసీపీ రంగు.. సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్
తమ్మెడపల్లి గ్రామ పంచాయతీ భవనానికి రంగులు మారుస్తున్న వైనం
  • Share this:
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మెడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రంగులు మార్చిన ఘటనపై కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. త్రివర్ణ పతాకం రంగులతో ఉన్న భవనానికి వైసీపీ రంగులు వేయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇందుకు బాధ్యుడైన గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆర్.ప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనాన్ని మళ్లీ వైట్ వాష్(తెల్ల సున్నం) చేయించారు. గురువారం గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుందని తెలిపారు. కాగా,ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. వైసీపీ నేతలు జాతీయ జెండాను అవమానిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గ్రామ పంచాయతీ భవనానికి జాతీయ జెండా రంగు మార్చి వైసీపీ రంగు వేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు జనసేన కూడా ఈ విషయంలో వైసీపీపై విమర్శలు గుప్పించింది.(వైట్ వాష్ అనంతరం తమ్మెడపల్లి గ్రామ పంచాయతీ భవనం)
First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading