మేక‌పాటి vs ఆనం: నెల్లూరులో స‌మ‌ర శంఖారావ స‌భ‌ ర‌ద్దుకు కార‌ణం ఇదేనా?

Anam Vs Mekapati | ఆనం, మేకపాటి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా స్థానిక పార్టీ క్యాడర్ కూడా ఇబ్బందిపడుతోంది. ఈ విషయం జగన్‌కి తెలియనిది కాదు. ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విభేదాల పార్టీకి నష్టం కలిగిస్తుందని జగన్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: February 11, 2019, 11:50 AM IST
మేక‌పాటి vs ఆనం: నెల్లూరులో స‌మ‌ర శంఖారావ స‌భ‌ ర‌ద్దుకు కార‌ణం ఇదేనా?
ఆనం, మేకపాటి
news18-telugu
Updated: February 11, 2019, 11:50 AM IST
(ఎం.బాలకృష్ణ - సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌ర శంఖ‌రావ‌ స‌భ‌లు రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. సమర శంఖారావ సభలతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. సభతో పాటు  స్థానిక పార్టీ క్యాడ‌ర్‌తో స‌మావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీని బూత్ స్థాయిలో జ‌గ‌న్ బ‌లోపేతం చేయ‌డంపై జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టారు. దీంతో పాటు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో నేత‌ల మ‌ధ్య ఏమైన విభేదాలు ఉంటే ఇద్ద‌రు నేత‌ల‌ను కూర్చొపెట్టుకొని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు జ‌గ‌న్.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ సమ‌ర శంఖ‌రావ‌ స‌భ‌లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయ‌డానికి వైసీపీ ఒక కార్య‌చ‌ర‌ణ రూపొందించుకుంది. దీనికి అనుగుణంగా తొలిత చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం, నెల్లూరు జిల్లాల్లో స‌భ‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ నెల్లూరులో నిర్వ‌హించాల్సిన స‌మ‌ర‌ శంఖ‌రావ స‌భ ర‌ద్దు అయిన‌ట్లు సమాచారం. ఈ స‌భ ర‌ద్దు అవ్వ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణాలే ఉన్న‌ట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో స్థానిక పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న నెలకొన్న ఆధిపత్య పోరు స‌ద్దుమణక పోవడమే ఇందుకు కార‌ణంగా చెబుతున్నారు. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేక‌పాటి మ‌ధ్య నెలకొన్న విభేదాలతో ఆ జిల్లాలో జ‌గ‌న్ స‌భ‌ను ర‌ద్దు చేసిన‌ట్లు స‌మాచారం.

ఆనం టీడీపీని వీడి వైసీపీలో చేరిన‌ప్ప‌టి నుంచి మేక‌పాటి విభేదిస్తోనే ఉన్నారు. జ‌గ‌న్ ప‌లుమార్లు భేటీలు ఏర్పాటు చేసి సర్దిచెప్పినా పరిస్థితిలో ఏ మాత్రం రాలేదు. ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఉన్న విభేదాలు కార‌ణంగా స్థానికంగా క్యాడ‌ర్ కూడా ఇబ్బందు ప‌డుతోంది.  ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా క్యాడర్ ఇబ్బందిపడుతుండడం జగన్‌కి కూడా తెలియనిదేం కాదు.  నెల్లూరులో స‌మ‌ర శంఖ‌రావ స‌భ ఏర్పాటు స‌మ‌యంలో అంద‌ర్ని కూర్చోపెట్టి మాట్లాడి, అందరి మధ్య సయోధ్య కుదర్చాలని జ‌గ‌న్ భావించారు. కానీ స‌భ ఏర్పాటు అంశంలోనే ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య సయోధ్య కుద‌ర‌క స‌భ ఏర్పాటు బాధ్య‌త‌లు ఎవ‌రు తీసుకొవ‌డానికి ముందుకురాలేద‌ని స‌మాచారం. ఈ కార‌ణంతోనే అనంత‌పురం తర్వాత మంగ‌ళ‌వారం నెల్లూరులో జ‌ర‌గాల్సిన సమ‌ర శంఖ‌రావ‌ స‌భ ర‌ద్దు అయిన‌ట్లు తెలుస్తోంది.
అయితే ఈ అంశంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా సిరియ‌స్ గా ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు స‌మాచారం. పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల‌ల్లో పాజిటివ్ సంకేతాలు వెళ్లుతున్న స‌మ‌యంలో సీనియ‌ర్ నేత‌లు ఇలా ప‌ట్టింపుల‌కు పోయి పార్టీ ఇబ్బంది ప‌డే విధంగా వ్యవ‌హ‌రించ‌డం ఏంట‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. అయితే మేక‌పాటి అసంతృప్తి వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని అంటున్నారు స్థానిక నేత‌లు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఒక ఎంపీ స్థానంతో పాటు ఒక అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించాల‌ని మేక‌పాటి జ‌గ‌న్ని కొరిన‌ట్లు తెలుస్తొంది. అయితే దీనికి జ‌గ‌న్ నుంచి సానుకూల స్పంద‌న రాలేదని సమాచారం.

ఈ ఇద్ద‌రి నేత‌ల‌ను త్వ‌ర‌లో జ‌గన్ పిలిపించి మాట్లాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అదే జిల్లాలో ఉన్న కాసాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఇత‌ర నేత‌లు విభేదాల‌తో సంబందం లేకుండా త‌మ ప‌ని తాము చేసుకుపోతుంటే మేక‌పాటి - ఆనం మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హారిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఈ ఇబ్బందులతో జ‌గ‌న్ నెల్లూరు స‌మ‌ర శంఖ‌రావ‌ స‌భ‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. దీంతో మంగ‌ళ‌వారం ఒంగోలు లో జ‌గ‌న్ స‌మ‌ర శంఖ‌రావ స‌భ జ‌ర‌గ‌బోతుంది.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...