ఆనంకు జగన్ క్లాస్ తీసుకుంటారా ?

ఆనంకు జగన్ క్లాస్ తీసుకుంటారా ?

ఆనం రామనారాయణరెడ్డి (File)

అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సీఎం జగన్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ను నేడు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిసి వివరణ ఇచ్చుకోనున్నారు.

  • Share this:
    నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందంటూ వైసీపీలో కొత్త కలకలానికి తెరలేపిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నేడు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని తన పార్టీకే చెందిన మంత్రి అనిల్‌కుమార్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలపై ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ఆనం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారని వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆనం... అసెంబ్లీలో తనదైన మార్కు చూపించి చంద్రబాబును ఇబ్బందిపెట్టారు. పరోక్షంగా సీఎం జగన్ కోపాన్ని చల్లార్చే ప్రయత్నాన్ని చేశారు.

    అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సీఎం జగన్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ను నేడు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కలిసి వివరణ ఇచ్చుకోనున్నారు. అయితే జగన్‌తో భేటీ సందర్భంగా ఆనం ఏయే అంశాలు ప్రస్తావిస్తారు ? ఆయనతో జగన్ ఏం చెబుతారు ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఆనం జగన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్ నేత అయిన ఆనం రామనారాయణరెడ్డికి ఈ భేటీలో జగన్ క్లాస్ తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు