Anakapalli Loksabha : టీడీపీ కంచుకోటలో వైసీపీ ఖాతా తెరుస్తుందా ?

Anakapalli Loksabha constituency profile : పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ 5 గెలిచి సత్తా చాటిన అధికార టీడీపీ పార్టీ ఈ సారి కూడా విజయం సాధిస్తుందా ? టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించి వైసీపీ తరపున బరిలోకి దిగిన అవంతి శ్రీనివాస్ తన పట్టు నిలుపుకుంటారా ?

news18-telugu
Updated: March 29, 2019, 4:02 PM IST
Anakapalli Loksabha : టీడీపీ కంచుకోటలో వైసీపీ ఖాతా తెరుస్తుందా ?
Anakapalli Loksabha constituency profile : పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ 5 గెలిచి సత్తా చాటిన అధికార టీడీపీ పార్టీ ఈ సారి కూడా విజయం సాధిస్తుందా ? టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించి వైసీపీ తరపున బరిలోకి దిగిన అవంతి శ్రీనివాస్ తన పట్టు నిలుపుకుంటారా ?
  • Share this:
విశాఖ పట్నం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒకటిగా పేరొందిన అనకాపల్లి.. 1962లో పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ స్థానంలో టీడీపీకి చెందిన ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి బరిలో నిలుచున్నారు. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో.. గత ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా టీడీపీ, వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. విజయం మాత్రం టీడీపీనే వరించింది. ఆ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 5,68,463 ఓట్లు సాధించి.. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై 47, 932 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 5, 20, 531 ఓట్లు లభించాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సబ్బం శ్రీహరి గెలుపొందారు.

అనకాపల్లి (ఫైల్ చిత్రం)
అనకాపల్లి (ఫైల్ చిత్రం)


అనకాపల్లిలో మొత్తం ఓటర్లు 14, 01, 474 మంది ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 6, 89, 132 మంది కాగా మహిళా ఓటర్లు 7,12,342 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం విశేషం.

జనరల్ స్థానంగా ఉన్న అనకాపల్లిలో.. ఇప్పటి వరకూ టీడీపీ, కాంగ్రెస్‌లతోనే గెలుపు దోబూచులాడింది. మూడో పార్టీ ఇంతవరకూ ఇక్కడ విజయాన్ని నమోదు చేయలేదు. 1962లో తొలిసారి పార్లమెంట్ ఎన్నికలబరిలో నిలిచిన అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదటి విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వరుస విజయాలు నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీకి.. 1982లో ఆవిర్భవించిన టీడీపీ షాకిచ్చింది. అనంతరం విజయం ఈ రెండు పార్టీలతోనే వరకు వరుస విజయాలు నమోదు చేసిన ఆ పార్టీ.. టీడీపీ ఆవిర్భావం తర్వాత గట్టి పోటీ ఎదుర్కొంది.



Pawan Kalyan unofficial tie up with Chandrababu Naidu to benifit TDP alleged by Jagan
జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్


ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలు ఈ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. ఈ స్థానాల్లో పాయకరావు పేట నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

1962 మొదలు ఇప్పటివరకూ ఈ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..
Loading...































































1962 మిస్సుల సూర్యనారాయణమూర్తి కాంగ్రెస్
1971 ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు కాంగ్రెస్
1977 ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు కాంగ్రెస్
1980 ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు కాంగ్రెస్
1984 పి. అప్పల నరసింహం టీడీపీ
1989 కొణతాల రామకృష్ణ కాంగ్రెస్
1996 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ
1998 గుడివాడ గుర్నాథరావు కాంగ్రెస్
 1999 గంటా శ్రీనివాసరావు టీడీపీ
2004 పప్పల చలపతిరావు టీడీపీ
2009 సబ్బం శ్రీహరి కాంగ్రెస్
2014 ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీ


First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...