Home /News /politics /

Huzurabad: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ ప్లాన్.. రంగంలోకి కీలక నేత

Huzurabad: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ ప్లాన్.. రంగంలోకి కీలక నేత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం చేయాలని భావిస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే అనే వాదన ఉంది. రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్.. గతంలో సాధించిన ఓట్లను మళ్లీ తెచ్చుకుంటే.. ఆ పార్టీ ఆశించిన స్థాయి ఫలితాలు సాధించినట్టే అనే చర్చ కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ సీటును సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్‌లు.. అందుకు తగ్గట్టుగా ప్లాన్స్ వేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ తరపున మంత్రి హరీశ్ రావు (Harish Rao) హుజూరాబాద్ నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారాన్ని ఉధృతం చేస్తుంటే.. బీజేపీ తరపున అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Etela Rajendar)తో పాటు పలువురు ముఖ్యనేతలు ప్రచారం చేపడుతున్నారు.

  అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కరోనా నిబంధనలు పాటిస్తూ వెయ్యి మందికి మించి సమావేశాలు ఏర్పాటు చేయొద్దనే నిబంధన ఉంది. దీంతో హుజూరాబాద్‌ పక్కన ఉన్న నియోజకవర్గాల్లో సభను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్టు సమాచారం.

  అందుకు తగ్గట్టుగా ఉంటే పలు ప్రాంతాలను టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఎంపిక చేశారని.. త్వరలోనే ఎక్కడ సమావేశం ఉంటుందనే అంశంపై క్లారిటీ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విషయంలో టీఆర్ఎస్‌ను ఫాలో కావాలని బీజేపీ యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ తరహాలోనే హుజూరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని.. ఆ సభకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాకు ఆహ్వానించాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం.

  Telangana: ఆ కారు బండి సంజయ్ మిత్రుడిదే.. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్

  Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

  హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ కచ్చితంగా గెలవాలని బీజేపీ నాయకత్వం కోరుకుంటోంది. ఇందుకోసం తమ వంతు సహకారం అందిస్తామని గతంలోనే రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఎన్నికల సభకు అమిత్ షా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ కేసీఆర్ సభను ఖరారు చేసిన వెంటనే బీజేపీ కూడా అమిత్ షా సభను షెడ్యూల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం చేయాలని భావిస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Huzurabad By-election 2021, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు