బెంగాల్లో 10 మంది ఎమ్మెల్యేల రాజీనామా, బీజేపీలో చేరిక, దీదీపై భగ్గుమన్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Image; @BJP4Bengal/Twitter)

పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. బెంగాల్లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.

 • Share this:
  పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. బెంగాల్లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఓ ఎంపీ, ఏడుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు దీదీకి రాంరాం కొట్టి కమలం గూటికి చేరారు. మరో ముగ్గురు నేతలు కూడా టీఎంసీకి గుడ్ బై కొట్టారు. అలాగే ఓ సీపీఐ ఎమ్మెల్యే, మరో సీపీఎం ఎమ్మెల్యే, ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. మమతా బెనర్జీ ఉద్యమాలకు కంచుకోట లాంటి పశ్చిమ మిడ్నాపూర్‌లో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ కీలక నేత, ఎమ్మెల్యే సువేందు అధికారి అమిత్ షా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, మరికొందరు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు.

  బీజేపీలో చేరిన టీఎంసీ నేతలు
  సునీల్ మండల్, టీఎంసీ ఎంపీ
  సువేందు అధికారి, మాజీ మంత్రి, టీఎంసీఎమ్మెల్యే
  బన్సారి మైతీ, టీఎంసీ ఎమ్మెల్యే
  బిశ్వజీత్ కుందు, టీఎంసీ ఎమ్మెల్యే
  సైకత్ పంజా, టీఎంసీ ఎమ్మెల్యే
  షీల్‌భద్ర దత్తా, టీఎంసీ ఎమ్మెల్యే
  దీపాలి బిశ్వాస్, టీఎంసీ ఎమ్మెల్యే
  శుక్రా ముండా, టీఎంసీ ఎమ్మెల్యే
  అశోక్ దిండా, సీపీఐ ఎమ్మెల్యే
  తపషి మండల్, సీపీఎం ఎమ్మెల్యే
  సుదీప్ ముఖర్జీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే
  దశరథ్ టిర్కీ, టీఎంసీ మాజీ ఎంపీ
  శ్యామపాద ముఖర్జీ, టీఎంసీ నేత, మాజీ మంత్రి
  సత్యన్ రాయ్, టీఎంసీ మాజీ ఎమ్మెల్యే

  ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కొందరు పంచాయతీ స్థాయి నేతలు కూడా బీజేపీలో చేరారు. డిసెంబర్ 16న సువేందు అధికారి టీఎంసీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి టీఎంసీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో ముఖ్యమైన నేతలు కూడా గుడ్ బై కొడుతున్నారు. రాజకీయ నేతలే కాకుండా ముఖ్యమంత్రి కార్యాలయ సలహాదారు అయిన రిటైర్డ్ కల్నల్ దీప్తాన్షు చౌదరి కూడా తన రాజీనామా సమర్పించారు. సుమారు 60 నుంచి 65 మంది నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్ అన్నారు.

  మమతా బెనర్జీపై భగ్గుమన్న అమిత్ షా
  టీఎంసీ నుంచి బీజేపీలో చేరికలకు ఇది ఆరంభం మాత్రమేనని, ఎన్నికలు అయ్యేసరికి ఆమె ఒంటరి కావడం ఖాయమన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె కలగంటున్నారని, అది సాధ్యం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధ్యమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం కల్పిస్తే తాము బంగారు బెంగాల్‌ను చేస్తామని అమిత్ షా ప్రకటించారు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అన్యాయంగా చంపేశారన్న అమిత్ షా.. 2021లో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: