హోమ్ /వార్తలు /రాజకీయం /

Amit Shah: అమిత్ షా బెంగాల్ టూర్ ఖరారు, అసెంబ్లీ ఎన్నికలకు మెగా ప్లాన్

Amit Shah: అమిత్ షా బెంగాల్ టూర్ ఖరారు, అసెంబ్లీ ఎన్నికలకు మెగా ప్లాన్

అమిత్ షా (File)

అమిత్ షా (File)

2021లో పశ్చిమ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన కోసమే అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నట్టు తెలిసింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. నవంబర్ 5వ తేదీన ఆయన బెంగాల్‌ వెళ్తారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. 2021లో పశ్చిమ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన కోసమే అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి నవంబర్ 6వ తేదీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, అమిత్ షా పర్యటన చివరి నిమిషంలో ఖరారైంది. దీంతో ప్రస్తుతానికి నడ్డా టూర్ వాయిదా పడింది. నవంబర్ 5వ తేదీన అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని మిడినీపూర్ జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం అవుతారు. అయితే, పూర్తి షెడ్యూల్ ఇంకా సిద్ధం కాలేదని బెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. నవంబర్ 5వ తేదీన ఆయన బెంగాల్‌ వెళ్తారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. 2021లో పశ్చిమ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన కోసమే అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి నవంబర్ 6వ తేదీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, అమిత్ షా పర్యటన చివరి నిమిషంలో ఖరారైంది. దీంతో ప్రస్తుతానికి నడ్డా టూర్ వాయిదా పడింది. నవంబర్ 5వ తేదీన అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని మిడినీపూర్ జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం అవుతారు. అయితే, పూర్తి షెడ్యూల్ ఇంకా సిద్ధం కాలేదని బెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ - మే మధ్య పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేసుకుంటూ అప్పటికి పార్టీని సర్వసన్నద్ధం చేయాలని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే బీహార్‌లో పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్‌ను కూడా రద్దు చేసి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారంటూ భారీ ప్లాన్‌ ఉండి ఉంటుందని నేతలు అంచనా వేస్తున్నారు. అమిత్ షా ముఖ్యంగా పార్టీ నేతలతోనే మాట్లాడతారని, ఎలాంటి బహిరంగ ర్యాలీలు ఉండబోవని బెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, నవంబర్ 6న కోల్‌కతాలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని బెంగాల్ బీజేపీ ఇన్ చార్జి కైలాష్ విజయవర్గీయ తెలిపారు.

అమిత్ షా టూర్‌ నిర్వహించే సమయంలోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, వైస్ ప్రెసిడెంట్ ముకుల్ రాయ్, బీజేపీ ఇన్ చార్జి విజయవర్గీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఇప్పటికే బెంగాల్ నేతలతో ఓ సారి అమిత్ షా వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. అయితే, లాక్ డౌన్ అమలు చేసిన తర్వాత అమిత్ షా బెంగాల్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చి 1న అమిత్ షా బెంగాల్లో పర్యటించారు. బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్ ధన్‌కర్ గురువారం నాడు ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీలో కూడా మార్పులు చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ సుబ్రతా చటోపాధ్యాయను తప్పించి అమితవా చక్రబర్తికి పగ్గాలు అప్పగించారు. కొన్ని దశాబ్దాల నుంచి బెంగాల్లో బీజేపీకి ఎలాంటి ప్రాభవం లేని స్థితి నుంచి  ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ప్రత్యర్థిగా మారింది బీజేపీ. 2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో 42 లోక్‌సభ సీట్లలో 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న మమతా బెనర్జీని దించి ఈ సారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

First published:

Tags: Amit Shah, Bjp, West Bengal

ఉత్తమ కథలు