• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AMIT SHAH TO MAKE CRUCIAL ANNOUNCEMENT IN PARLIAMENT AT 11AM SB

ముగిసిన కేంద్ర కేబినెట్... కాసేపట్లో కాశ్మీర్‌పై పార్లమెంట్‌లో ప్రకటన

ముగిసిన కేంద్ర కేబినెట్... కాసేపట్లో కాశ్మీర్‌పై పార్లమెంట్‌లో ప్రకటన

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌పై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

  • Share this:
    ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ మగిసింది. కాశ్మీర్‌లో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. కాశ్మీర్‌పై ఉభయసభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేయనున్నారు. 11 గంటలకు లోక్‌సభలో, 12 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తే జమ్ముకాశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు సోమవారం నుంచి బుధవారం వరకు సభకు తప్పకుండా హాజరుకావాలని పార్టీ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో కేంద్రం ఏదో చేయబోతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

    జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న కేబినెట్ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. మరోవైపు రాజ్యసభలో జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును అమిత్ షా ఇవాళ ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది.

    మరోవైపు జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికే నెలకొన్న టెన్షన్ వాతావరణంపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఏదో కీలక పరిణామం జరగబోతోందనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయం, తదనుగుణంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లులపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాశ్మీర్ విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ విశ్లేషకులంతా జోరుగా చర్చించుకుంటున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    అగ్ర కథనాలు