news18-telugu
Updated: June 28, 2019, 12:40 PM IST
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో నేడు జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత లోక్సభలో అమిత్ షా ప్రవేశపెట్టనున్నతొలి బిల్లు ఇదే కావడం గమనార్హం. గతంలో ఆర్డినెన్స్ ద్వారా కశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు చట్ట సవరణ చేసిన కేంద్రం.. ఇప్పుడు ఉభయ సభల్లో ఆమోదం ద్వారా దాన్ని చట్టం చేయాలని యోచిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఇదే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ చట్ట సవరణ-2019 ద్వారా కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడినఅన్ని వర్గాల యువతకు రిజర్వేషన్లు లభించనున్నాయి. కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న.. ఆర్థికంగా వెనుకబడినవారికి ఈ రిజర్వేషన్ ఫలాలు అందనున్నాయి. కశ్మీర్ రిజర్వేషన్ బిల్లుతో పాటు నేడు ఆధార్ సహా మరికొన్ని సవరణ బిల్లులు నేడు సభకు ముందుకు రానున్నాయి. ఆధార్ చట్ట సవరణ బిల్లు ద్వారా పసికందులు, చిన్నారులను బయోమెట్రిక్ నుంచి మినహాయించనున్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే వారి నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.
Published by:
Srinivas Mittapalli
First published:
June 24, 2019, 10:29 AM IST