ఇక దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ.. బెంగాల్‌లో అనుమతించమన్న మమతా బెనర్జీ

NRC across India : అసోంలో నిర్వహించినట్టే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్‌సీ నిర్వహిస్తామన్నారు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియలో ఎలాంటి మతపరమైన వివక్షలు ఉండబోవని స్పష్టం చేశారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుందని తెలిపారు.

news18-telugu
Updated: November 21, 2019, 8:00 AM IST
ఇక దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ.. బెంగాల్‌లో అనుమతించమన్న మమతా బెనర్జీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (File Photo)
  • Share this:
భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ ముసాయిదాను (ఎన్‌ఆర్‌సీ-నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్‌షిప్)ను అమలుచేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. అసోంలో నిర్వహించినట్టే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్ఆర్‌సీ నిర్వహిస్తామన్నారు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియలో ఎలాంటి మతపరమైన వివక్షలు ఉండబోవని స్పష్టం చేశారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుందని తెలిపారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకే ఎన్‌ఆర్‌సీ తీసుకొస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో హిందువులు, బౌద్దులు, జైనులు, క్రిస్టియన్స్, సిక్కులు, పార్సీ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు.జాతీయ పౌరసత్వ బిల్లును లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదం తర్వాత సభ రద్దయిందని గుర్తుచేశారు. త్వరలోనే పౌరసత్వ బిల్లు సభ ముందుకు వస్తుందన్నారు.(పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ)

మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సీ ప్రకటనను వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలను మత ప్రాతిపదికన విభజించడానికి తృణమూల్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు.ఎవరి పౌరసత్వాన్ని ఎవరు లాగేసుకోలేరని అన్నారు. అసోంలో అగస్టు 31న వెల్లడించిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో 14లక్షల మంది హిందువులు, బెంగాలీలకు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. బెంగాల్‌లో మతపరమైన చిచ్చు పెట్టడానికే ఎన్‌ఆర్‌సీ కుట్రకు తెరలేపారని.. ఇక్కడ దాన్ని అమలుచేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు.
First published: November 21, 2019, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading