• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AMIT SHAH REACTS TO YSRCP MP VIJAYASAI REDDY LETTER OVER CBI JD APPOINTMENT BA

సీబీఐ కేసులో విజయసాయిరెడ్డి లేఖపై అమిత్ షా కీలక ఆదేశాలు...

సీబీఐ కేసులో విజయసాయిరెడ్డి లేఖపై అమిత్ షా కీలక ఆదేశాలు...

అమిత్ షా‌తో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి (ఫైల్ ఫోటో)

సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధం లేని అధికారిని నియమించాలని విజయసాయిరెడ్డి అమిత్ షాకు లేఖ రాశారు.

  • Share this:
    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మీద నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ జేడీగా తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలకు సంబంధం లేని అధికారిని నియమించాలని విజయసాయిరెడ్డి అమిత్ షాకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అమిత్ షా... విజయసాయిరెడ్డి లేఖపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు సూచించారు. ఈ మేరకు సంబంధిత లేఖను విజయసాయిరెడ్డికి కూడా అమిత్ షా కార్యాలయం ప్రత్యుత్తరం ఇచ్చింది.

    విజయసాయిరెడ్డి రాసిన లేఖకు స్పందించి అమిత్ షా రాసిన ప్రత్యుత్తరం


    అమిత్ షాకు విజయసాయిరెడ్డి రాసిన లేఖలో ఏముంది?

    ‘ఏపీకి చెందని, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా నియమించాలి. గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారు. ప్రస్తుత హైదరాబాద్ సీబీఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తి, రాజకీయాలతో ముడి పడి ఉన్న అధికారి. కృష్ణ సైతం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయాలతో ప్రభావితమై నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు లక్ష్మీనారాయణ సన్నిహితులైన హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, కర్ణాటక అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. లక్ష్మీనారాయణతో పలు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని, రాజకీయాలతో సంబంధం లేని అధికారిని హైదరాబాద్లో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమించాలి’ అని విజయసాయిరెడ్డి లేఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖ


    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈనెల 10న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని, సహ నిందితుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరవుతారని సీబీఐ న్యాయమూర్తిని కోరారు. అయితే, దీనిపై ఈనెల 17న కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: