Home /News /politics /

AMIT SHAH REACTIONS ON SUPREME COURT HISTORIC JUDGEMENT ON AYODHYA VERDICT SB

Ayodhya Verdict: అయోధ్య తీర్పుపై అమిత్ షా స్పందన

అమిత్ షా

అమిత్ షా

రామ్ జన్మభూమి చట్టపరమైన వివాదం పరిష్కారం కోసం ప్రయత్నించిన అన్ని సంస్థలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు.

    వివాదాస్పద అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దశాబ్ధాల నుంచి నానుతున్న రామ్ జన్మభూమి చట్టపరమైన వివాదంపై ఈ నిర్ణయంతో తుది రూపు వచ్చిందన్నారు. భారతదేశ న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులందరినీ అభినందిస్తున్నానని షా ట్వీట్ చేశారు.రామ్ జన్మభూమి చట్టపరమైన వివాదం పరిష్కారం కోసం ప్రయత్నించిన అన్ని సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం దేశానికి చెందిన సంత్ సమాజ్ మరియు ఇన్ని సంవత్సరాలు ప్రయత్నించిన లెక్కలేనన్ని మంది వ్యక్తులకు అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సమాజాలు మరియు మతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని సులువుగా అంగీకరించాలన్నారు. శాంతి, సామరస్యంతో నిండిన 'ఏక్ భారత్-శ్రేష్ట భారత్' ప్రతిజ్ఞకు అంతా కట్టుబడి ఉండాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.

    दशकों से चले आ रहे श्री राम जन्मभूमि के इस कानूनी विवाद को आज इस निर्णय से अंतिम रूप मिला है। मैं भारत की न्याय प्रणाली व सभी न्यायमूर्तियों का अभिनन्दन करता हूँ।






    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Amit Shah, Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు