#AmitShahToNews18 | వీర్‌ సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై అమిత్ షా స్పందన

మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వీర్ సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై హామీ ఇచ్చింది బీజేపీ. తాము అధికారంలోకి వస్తే వీర్ సావర్కర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' అవార్డు వచ్చే కృషి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

news18-telugu
Updated: October 17, 2019, 7:40 PM IST
#AmitShahToNews18 | వీర్‌ సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై అమిత్ షా స్పందన
అమిత్ షా ఇంటర్వ్యూ
news18-telugu
Updated: October 17, 2019, 7:40 PM IST
హిందూ మహాసభ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్‌కు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించబోతుందన్న ప్రచారంపై విపక్షాలు మండిపడుతున్నాయి. గాంధీజీ హత్యకేసులో వీర్ సావర్కర్ అరెస్టయ్యారని.. అలాంటి వ్యక్తికి భారత రత్న ఇస్తారా..? అంటూ కాంగ్రెస్, ఎంఐఎం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు అమిత్ షా. వీర్ సావర్కర్‌కు భారతరత్న అవార్డును వ్యతిరేకిస్తున్న వారంతా జాతి మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. దేశ ప్రజలు ఆయన్ను ఆదర్శకంగా తీసుకోకుండా పాపాలు చేస్తున్నారని అన్నారు.

దేశభక్తి ఉన్న ప్రజలు మాత్రమే వీర్ సావర్కర్‌ను ఇష్టపడతారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబాలనే ఆయన్ను ఆదరిస్తారు. దేశం కోసం జైల్లో వీర్ సావర్కర్ అనుభవించిన చిత్రహింసలు ఇంకెవరూ అనుభవించలేదు. సావర్కర్ సోదరులు 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. బ్రిటిషోళ్లు ఎన్నోసార్లు సావర్కర్ ఆస్తులను కొల్లగొట్టారు. దేశం కోసం ఆయన సర్వం ధారపోశారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న అవార్డును వ్యతిరేకిస్తున్న వారంతా జాతి మనోభావాలతో ఆడుకుంటున్నట్లే.
అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వీర్ సావర్కర్‌కు భారతరత్న అవార్డుపై హామీ ఇచ్చింది బీజేపీ. తాము అధికారంలోకి వస్తే వీర్ సావర్కర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' అవార్డు వచ్చే కృషి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అంతేకాదు జ్యోతిబా పూలే, సావిత్రభాయ్ పూలేకు భారత రత్న సాధించడమే లక్ష్యమని తెలిపింది. బీజేపీ తీరుపై కాంగ్రెస్, ఎంఐఎం సహా పలు పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. గాంధీజీ హత్య కేసులో సావర్కర్ అరెస్టయ్యారని.. సావార్కర్ ప్రమేయంపై జీవన్‌లాల్ కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం బీజేపీపై మండిపడ్డారు.

కాగా, 1949లో గాంధీ హత్యలో కేసులో వీర్ సావర్కర్‌ను అరెస్ట్ చేశారు. ఐతే తగిన ఆధారాలు లేకపోవడంతో ఆయన్ను నిర్దోషిగా విడుదల చేశారు. ఇక 2000లో వాజ్‌పేయి ప్రభుత్వం సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ప్రతిపాదనలు పంపింది. ఐతే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు.



First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...