శివసేన నేతే సీఎం.. బీజేపీ అవసరం లేదన్న ఉద్ధవ్ థాక్రే

బీజేపీ లేకున్నా శివసేన నేతను సీఎం పీఠంపై కూర్చోబెట్టగలమని ధీమా వ్యక్తం చేశారు ఉద్ధవ్ థాక్రే. శివసేన నాయకుడు సీఎం అయ్యేందుకు అమిత్ షా ఆమోదం అవసరం లేదని విమర్శించారు.

news18-telugu
Updated: November 8, 2019, 7:02 PM IST
శివసేన నేతే సీఎం.. బీజేపీ అవసరం లేదన్న ఉద్ధవ్ థాక్రే
ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే
news18-telugu
Updated: November 8, 2019, 7:02 PM IST
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. బీజేపీ, శివసేన మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై.. శివసేన ఎదురుదాడికి దిగింది. 50-50 ఫార్ములాపై హామీ ఇచ్చి మాట తప్పారని బీజేపీపై ఉద్ధవ్ థాక్రే విరుచుకుపడ్డారు. సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షానే మాటిచ్చారని.. అబద్ధాలకోరులతో ఇకపై మాటల్లేవ్ అని స్పష్టం చేశారు ఉద్ధవ్. తమతో కలిసేందుకు ఎవరు ముందుకొచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

శివసేన నాయకుడు సీఎం అవుతారని బాబా సాహెబ్‌కు మాటిచ్చా. బీజేపీతో 25 ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో చెరి సగం కాలం కావాలని అడుగుతున్నాం. దానికి అమిత్ షా గతంలోనే అంగీకరించారు. మేం అబద్ధాలు చెప్పడం లేదు. వాళ్లే మాట తప్పారు. మమ్మల్ని అబద్ధాలకోరులు అంటున్నారు. ఆ మాటలను వెనక్కి తీసుకోకుంటే వారితో ఇకపై మాట్లాబోం. ఫడ్నవీస్‌ను సోదరుడిగా భావించాం. కానీ ఇలా చేస్తారనుకోలేదు.
ఉద్ధవ్ థాక్రే


బీజేపీ లేకున్నా శివసేన నేతను సీఎం పీఠంపై కూర్చోబెట్టగలమని ధీమా వ్యక్తం చేశారు ఉద్ధవ్ థాక్రే. శివసేన నాయకుడు సీఎం అయ్యేందుకు అమిత్ షా ఆమోదం అవసరం లేదని విమర్శించారు. తమపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న శివసేన అధ్యక్షుడు..ఇన్నాళ్లు తప్పుడు మనుషులతో స్నేహం చేశామని అనిపిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోవాలని.. లేదంటే వేరే పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు థాక్రే. మహారాష్ట్ర ప్రజలకు అమిత్ షా కంటే.. థాక్రే కుటుంబంపైనే ఎక్కువ నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...