హోమ్ /వార్తలు /politics /

KCR వ్యూహాలకు కౌంటర్ రెడీ.. రంగంలోకి దిగిన Amit Shah.. ఆ ఏడుగురు నేతలకు పిలుపు

KCR వ్యూహాలకు కౌంటర్ రెడీ.. రంగంలోకి దిగిన Amit Shah.. ఆ ఏడుగురు నేతలకు పిలుపు

అమిత్ షా, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

అమిత్ షా, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: వ్యూహాత్మకంగా ముందుకు సాగితే.. తెలంగాణలోనూ అధికారం తమ సొంతమవుతుందని భావించిన బీజేపీ.. ఇప్పుడు అలాంటి దారిలోనే ముందుకు సాగాలని యోచిస్తోంది.

కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై రాజకీయ పోరాటాన్ని అధికార టీఆర్ఎస్ తీవ్రతరం చేసింది. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్.. కేంద్రం సరిగ్గా స్పందించడం లేదంటూ సమావేశాలను బహిష్కరించింది. దీంతో ఆ పార్టీ అధినేత బీజేపీ టార్గెట్‌గా ఎలాంటి కొత్త వ్యూహం రచిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ తమను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడంపై బీజేపీ హైకమాండ్ కూడా అప్రమత్తమైంది. తెలంగాణలో బలపడుతున్న తమను అడ్డుకునేందుకు కేసీఆర్ వేస్తున్న వ్యూహాలకు చెక్ చెప్పాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని నలుగురు బీజేపీ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలను ఆయన ఢిల్లీ రావాలని ఆదేశించారని తెలుస్తోంది. త్వరలోనే వీరిలో అమిత్ షా సమావేశం కానున్నారని.. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి వేసిన ప్లాన్‌ను వారికి వివరించబోతున్నట్టు తెలుస్తోంది. తమకు అధికారం దక్కే అవకాశం ఉండటంతో పాటు ఎక్కువ ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో మిగతా రాష్ట్రాల్లో తగ్గే సీట్లను తెలంగాణలో సీట్లు పెంచుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా బీజేపీకి ఉన్నాయని బీజేపీ యోచిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత తెలంగాణ విషయంలో బీజేపీ వైఖరి, వ్యూహం మారిపోయాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

వ్యూహాత్మకంగా ముందుకు సాగితే.. తెలంగాణలోనూ అధికారం తమ సొంతమవుతుందని భావించిన బీజేపీ.. ఇప్పుడు అలాంటి దారిలోనే ముందుకు సాగాలని యోచిస్తోంది. అందుకే గతానికి భిన్నంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని.. ఈ సమయంలో మళ్లీ పార్టీ ఇమేజ్ తగ్గకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని.. టీఆర్ఎస్‌పై రాజకీయ పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు.

TRSలో ఆ పదవులు ఎవరికి ? KCR లెక్క ఏంటి ?.. భారీగా ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలు

Revanth Reddy: అలా జరగకుండా చూడండి.. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్..

Telangana: కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ఈటల బీజేపీకి అలాంటి సలహా ఇచ్చారా ?

ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి బీజేపీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో చర్చించి.. పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యల గురించి అమిత్ షా చర్చిస్తారని తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్ర నేతలతో అమిత్ షా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేస్తే.. తెలంగాణపై ఆ పార్టీ గతంతో పోల్చితే మరింత ఎక్కువగా దృష్టి పెట్టిందనే సంకేతాలు వెళ్లడం ఖాయమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

First published:

Tags: Amit Shah, CM KCR, Telangana

ఉత్తమ కథలు