వన్ నేషన్ వన్ కార్డ్.. ఒకే కార్డులో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసెన్స్

ఈసారి జనగణనను డిజిటల్ రూపంలో చేపడతామని.. అందుకోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు. అంతేకాదు తొలిసారిగా జాతీయ జనాభా పట్టీ (NPR)ని రూపొందిస్తామని అమిత్ షా వెల్లడించారు.

news18-telugu
Updated: September 23, 2019, 3:06 PM IST
వన్ నేషన్ వన్ కార్డ్.. ఒకే కార్డులో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసెన్స్
అమిత్ షా
  • Share this:
'ఒకే దేశం-ఒకే ఎన్నిక', 'ఒకే దేశం-ఒకే భాష'..! కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలపై సానుకూల స్పందన వచ్చినా..హిందీ భాషపై మాత్రం దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మరోసారి 'వన్ నేషన్' అంశాన్ని తెరమీదకు తెచ్చింది కేంద్రం. 'వన్ నేషన్-వన్ ఐడెండిటీ కార్డ్' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త ప్రతిపాదన తెచ్చారు. ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్ వంటి పలు గుర్తింపు కార్డులు ఉన్నాయని.. వీటన్నింటిని ఒకే గొడుకు కిందకు తెచ్చి మల్టీ పర్సప్ ఐడీ కార్డు రూపొందించే యోచనలో కేంద్రం ఉందని ఆయన తెలిపారు.

ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి అవసరాలకు ఒకే గుర్తింపుకార్డు ఉంచుకోవచ్చు. ఇది సాధ్యం కూడా.
అమిత్ షా


ఇక 2021 జనాభా లెక్కలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఈసారి జనగణనను డిజిటల్ రూపంలో చేపడతామని.. అందుకోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు. అంతేకాదు తొలిసారిగా జాతీయ జనాభా పట్టీ (NPR)ని రూపొందిస్తామని అమిత్ షా వెల్లడించారు. దేశంలో ఎవరైనా ఓ వ్యక్తి చనిపోతే ఆ వివరాలు ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయ్యే వ్యవస్థను తీసుకొస్తామన్నారు హోంమంత్రి. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121కోట్లని తెలిసిందే.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>