• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AMIT SHAH MOCKS AT DMK CONGRESS DYNASTY POLITICS WITH 2G 3G 4G BA

Amit Shah: 2జీ, 3జీ, 4జీలకు అమిత్ షా కొత్త అర్థం.. తమిళనాట ఎన్నికల ప్రచారంలో సెటైర్లు

Amit Shah: 2జీ, 3జీ, 4జీలకు అమిత్ షా కొత్త అర్థం.. తమిళనాట ఎన్నికల ప్రచారంలో సెటైర్లు

అమిత్ షా (File)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2జీ, 3జీ, 4జీలకు కొత్త అర్థం చెప్పారు. తమిళనాట ప్రతిపక్ష డీఎంకే పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు.

  • Share this:
    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2జీ, 3జీ, 4జీలకు కొత్త అర్థం చెప్పారు. తమిళనాట ప్రతిపక్ష డీఎంకే పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తమిళనాడులో కుటుంబ రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి 2జీ, 3జీ, 4జీలను వినియోగించారు. 2జీ అంటే మారన్ కుటుంబంలో రెండు తరాలు, 3జీ అంటే కరుణానిధి కుటుంబంలో మూడు తరాలు, 4జీ అంటే కాంగ్రెస్ కుటుంబంలో నాలుగు తరాలు అంటూ విమర్శలు గుప్పించారు. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. పదేళ్లుగా పవర్ లో ఉన్న అన్నాడీఎంకే హాట్రిక్ కొట్టాలని చూస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్ష డీఎంకే ఈసారైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

    అన్నాడీఎంకే, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అయితే, అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన శశికళను కూడా అన్నాడీఎంకేలో జట్టుగా చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే పార్టీని నడుపుతున్న పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామి మీద ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరిగింది.



    శశికళ వల్ల విజయావకాశాలు దెబ్బతింటాయని బీజేపీ భావిస్తోంది. అయితే, ఆమెను మళ్లీ పార్టీలోకి తీసుకోకూడదని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు మంత్రి జయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమను ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టం చేశారు. ‘మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేదు. మా పార్టీ అంతర్గత విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. ఇంతకుముందే సీఎం చెప్పినట్టు ఏఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇది మా కచ్చితమైన నిర్ణయం. అమిత్ షాతో సమావేశంలో విలీనం గురించి చర్చించినట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఏఎంఎంకేలో గుంటనక్కలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో సింహాలు ఉన్నాయి. ఇక అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు సుజావుగా జరుగుతుంది. దీనిపై త్వరలో నిర్ణయానికి వస్తాం.’ అని జయకుమార్ స్పష్టం చేశారు.

    తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరితో పాటు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: