ఎన్నికలవేళ బీజేపీ కొత్త నినాదం : 'నా కుటుంబం-నా బీజేపీ' క్యాంపెయిన్ ప్రారంభం

My Family-BJP Family : అమిత్ షా క్యాంపెయిన్ ప్రారంభించడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు కొత్త నినాదాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: February 12, 2019, 11:51 AM IST
ఎన్నికలవేళ బీజేపీ కొత్త నినాదం : 'నా కుటుంబం-నా బీజేపీ' క్యాంపెయిన్ ప్రారంభం
అహ్మదాబాద్‌లోని తన నివాసం వద్ద కొత్త క్యాంపెయిన్ ప్రారంభిస్తున్న అమిత్ షా..
news18-telugu
Updated: February 12, 2019, 11:51 AM IST
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కమలదళం మరో కొత్త నినాదాన్ని తెర పైకి తెచ్చింది. 'నా కుటుంబం-బీజేపీ కుటుంబం' అన్న నినాదంతో మంగళవారం గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని తన ఇంటి వద్ద బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ జెండా ఆవిష్కరించి క్యాంపెయిన్ ప్రారంభించారు.

ఈ క్యాంపెయిన్ ద్వారా ఐదు కోట్ల కుటుంబాలకు చేరుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మార్చి 12వ తేదీని డెడ్‌లైన్‌గా పెట్టుకున్న పార్టీ 5కోట్ల ఇళ్లపై బీజేపీ జెండా ఎగిరేలా ప్లాన్ చేస్తోంది. అమిత్ షా క్యాంపెయిన్ ప్రారంభించడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు కొత్త నినాదాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

బీజేపీ జెండా అభివృద్దికి, జాతీయతా భావానికి ప్రతీక. మోదీ హయాంలో అంతమైన కులతత్వానికి, కుటుంబ పాలన అంతానికి ఇదొక ప్రతిరూపం.
అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...