AMIT SHAH INTERVIEW THERE IS NO ANGER BECAUSE OF THE FARMERS MOVEMENT AMIT SHAH SAID FARMERS WITH BJP PVN
UP Election : రైతుల ఆందోళనల ప్రభావం లేదు..బీజేపీ వెంటే రైతన్నలు
స్యూస్ 18 ఇంటర్వ్యూలో అమిత్ షా
Amit Shah Exclusive Interview to News18 : నెట్వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి మరియు సీనియర్ బిజెపి నాయకుడు అమిత్ షా పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా రైతులు బీజేపీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు..బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శలపై అమిత్ షా స్పందించారు.
Amit Shah Exclusive Interview to News18 : యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నెట్వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి మరియు సీనియర్ బిజెపి నాయకుడు అమిత్ షా పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా రైతులు బీజేపీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు..బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శలపై అమిత్ షా స్పందించారు. బీజేపీ పట్ల రైతుల్లో ఎలాంటి కోపం లేదని,ఇటీవల రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఆందోళన వల్ల బీజేపీపై ఎవరిలోనూ ఎలాంటి కోపం లేదని అమిత్ షా అన్నారు. రైతుల్లో అపోహలు కల్పించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే రైతులు మాత్రం బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు. యూపీ ఎన్నికలలో రైతుల ఉద్యమ ప్రభావం ఉండదని మరియు బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని షా తెలిపారు.
యూపీలో యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా అని అమిత్ షాను అడిగినప్పుడు... కచ్చితంగా యోగి నేతృత్వంలో ఎన్నికల్లో పోరాడుతున్నామని చెప్పారు. ఎన్ని సీట్లు వచ్చినా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. యోగి ప్రభుత్వం కొత్తగా 51 కాలేజీలు ఏర్పాటు చేసిందని, ఇప్పుడు 40 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు. యూపీలో కొత్త అభివృద్ధి నమూనాను యోగి సర్కార్ సిద్ధం చేసిందన్నారు. యూపీలో 5 ఎక్స్ప్రెస్వేలను నిర్మించేందుకు పనులు కొనసాగుతున్నాయి. యూపీలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అన్ని మతాలు, కులాల కోసం అభివృద్ధి పథకాలు రూపొందించబడ్డాయని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర పథకాలను కొనియాడుతూ.. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల కోసం బీజేపీ పని చేసిందన్నారు.
జరుగుతున్న యూపీ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో. విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అమిత్ షా ఇంటర్వ్యూలో చెప్పారు. 2017 లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్వేలలో తమకు 238సీట్లు వస్తాయని చెప్పారని..కానీ తమకు 325 సీట్లు వచ్చాయని షా గుర్తుచేశారు.
బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్ లో మహిళల భద్రత కూడా మెరుగుపడిందని అమిత్ షా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాన్పూర్ లో తాను అర్ధరాత్రి స్కూటీలపై రోడ్లపైకి వచ్చిన అమ్మాయిలను చూశానని..దీని పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. తాను దీన్ని తన హోటల్ కిటికీలోంచి చూశానన్నారు. ఇది గొప్ప విజయం మరియు ప్రజలు మా పనిని అభినందిస్తున్నారు.. మరియు అది ఓట్లలోకి మారుతుంది అని అమిత్ షా అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.