#AmitShahToNews18 : ఏమైనా జరగొచ్చు.. గంగూలీపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

#AmitShahToNews18 : తనను సౌరవ్ గంగూలీ కలవడం నిజమేనని చెప్పిన అమిత్ షా... భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అన్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 7:26 PM IST
#AmitShahToNews18 : ఏమైనా జరగొచ్చు.. గంగూలీపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
అమిత్ షా
news18-telugu
Updated: October 17, 2019, 7:26 PM IST
త్వరలోనే బీసీసీఐ కొత్త బాస్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ... ఆ తరువాత బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీనే బీజేపీకి ఆ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై నెట్‌వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సౌరవ్ గంగూలీ కలవడం నిజమేనని చెప్పిన గంగూలీ... ఈ భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. ఇది కేవలం స్నేహపూర్వకమైన సమావేశం మాత్రమే అని అన్నారు.

అయితే బెంగాల్ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని అమిత్ షా వ్యాఖ్యానించారు. తనను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న అమిత్ షా... భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని వెల్లడించారు. బెంగాల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశంపై కూడా అమిత్ షా స్పందించారు. ముకుల్ రాయ్ బెంగాల్‌లో బీజేపీకి నాయకత్వం వహించే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డ అమిత్ షా... అయినా స్థానిక నాయకత్వంతోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని అన్నారు. రాబోయే రోజుల్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే బెంగాల్‌లో కొనసాగుతున్న పాలనకు వ్యతిరేకంగా తాము తీవ్రమైన పోరాటం చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.






First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...