Modi 2.0 Cabinet Portfolios: అమిత్ షాకు హోం.. రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖ...

గతంలో మోదీ కేబినెట్‌లో రక్షణ శాఖను నిర్వహిస్తూవచ్చిన నిర్మలా సీతారామన్‌కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. ఆమె ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తారు.

news18-telugu
Updated: May 31, 2019, 1:24 PM IST
Modi 2.0 Cabinet Portfolios: అమిత్ షాకు హోం.. రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖ...
గతంలో మోదీ కేబినెట్‌లో రక్షణ శాఖను నిర్వహిస్తూవచ్చిన నిర్మలా సీతారామన్‌కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. ఆమె ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తారు.
  • Share this:
మోదీ కేబినెట్‌లో మంత్రులకు పోర్టు ఫోలియోలు కేటాయించారు. అమిత్ షాకు కేంద్ర హోంశాఖ కేటాయించారు.  రాజనాథ్‌ సింగ్‌కు రక్షణ శాఖ మంత్రి ఇచ్చారు. గతంలో మోదీ కేబినెట్‌లో రక్షణ శాఖను నిర్వహిస్తూవచ్చిన నిర్మలా సీతారామన్‌కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. ఆమె ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తారు. అనారోగ్యం కారణంగా కేబినెట్‌లో కొనసాగడంపై మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విముఖుత చూపడం తెలిసిందే.

నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణ రహదారుల శాఖ కేటాయించారు. ప్రకాశ్ జవదేకర్‌కు సమాచార శాఖ కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైకా మంత్రి కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. మాజీ విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు. గతంలో ఈ శాఖను సుష్మా స్వరాజ్ నిర్వహిస్తూ వచ్చారు. అనారోగ్య కారణాలతో ఆమె కూడా మోదీ 2.0 కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ఇక అమేథిలో రాహుల్‌పై గెలుపొందిన స్మృతి ఇరానికి మోదీ కేబినెట్‌లో మహిళా శిశి సంక్షేమ శాఖతో పాటు జౌళి శాఖను కేటాయించారు.

అమిత్ షా - హోంశాఖ

హోంశాఖ సహాయ మంత్రి - కిషన్ రెడ్డి


రాజ్ నాథ్ సింగ్ - రక్షణ శాఖ
పీయూష్ గోయల్ - రైల్వే శాఖ,పరిశ్రమలు, వాణిజ్యం
నిర్మలా సీతారామన్ -ఆర్థిక శాఖనితిన్ గడ్కరీ - రోడ్డు, రవాణా, రహదారుల శాఖ
నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
సదానంద గౌడ - కెమికల్ అండ్ ఫర్టిలైజర్ (ఎరువులు,రసాయనాలు) శాఖ
ప్రకాష్ జవదేకర్ - పర్యావరణం, అటవీ శాఖ
రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ
థావర్ చంద్ గహ్లోత్ - సామాజిక న్యాయ శాఖ
సుబ్రహ్మణ్య జయ శంకర్ - విదేశాంగ శాఖ
అర్జున్ ముండా - గిరిజన వ్యవహారాల శాఖ
ధర్మేంద్ర ప్రదాన్ - పెట్రోలియం, గ్యాస్, స్టీల్ శాఖ
స్క్మృతి ఇరానీ - మహిళా శిశు సంక్షేమం, టెక్స్ టైల్ శాఖ
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ -మైనార్టీ శాఖ
హరిసిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్
అరవింద్ గణపత్ సావంత్ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
మహేంద్ర నాథ్ - స్కిల్ డెవలప్ మెంట్
రాంవిలాస్ పాశ్వాస్ - ఆహార, పౌర సరఫరాల శాఖ
ప్రహ్లాద్ జోషి - పార్లమెంటరీ వ్యవహారాలు, మైనింగ్ శాఖ(బొగ్గు, గనులు)
ప్రహ్లాద్ సింగ్ పటేల్ (స్వతంత్ర) - సాంస్కృతిక, పర్యాటక శాఖ
రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ - మానవ వనరుల శాఖ
హర్షవర్థన్ - వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ
శ్రీపాద యశో నాయక్ - ఆయుష్, రక్షణ శాఖ సహాయ మంత్రి
జితేంద్ర సింగ్ -పీఎంవో సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, అంతరిక్ష పరిశోధన, ఈనాశ్య రాష్ట్రాల వ్యవహారాలు
కిరణ్ రిజిజు - క్రీడలు, యువజన, మైనార్టీ వ్యవహారాలు
గిరిరాజ్ సింగ్ - పాడి, పశు గణాభివృద్ధి, ఫిషరీస్
గజేంద్ర సింగ్ షెకావత్ - నీటివనరులు (జల్ శక్తి)
సంతోష్ కమార్ గాంగ్వర్ (స్వతంత్ర) - శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
ఇంద్రజీత్ సింగ్ (స్వతంత్ర) - ప్రణాళిక, గణాంక శాఖ
రాజ్ కుమార్ సింగ్ (స్వతంత్)- విద్యుత్ సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
ఫగన్ సింగ్ కులస్థే - ఉక్కు శాఖ సహాయ మంత్రి
అర్జున్ రామ్ మేఘవాల్ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయ మంత్రి
జనరల్ వీకే సింగ్ - రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రిFirst published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>