హోమ్ /వార్తలు /National రాజకీయం /

Exclusive: యూపీ ఎన్నికల్లో ఆ నాలుగే ప్రధానం.. అమిత్ షా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.."బాహుబలి"పై ఇంట్రస్టింగ్ కామెంట్స్

Exclusive: యూపీ ఎన్నికల్లో ఆ నాలుగే ప్రధానం.. అమిత్ షా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.."బాహుబలి"పై ఇంట్రస్టింగ్ కామెంట్స్

Amith Shah On UP Election : మేము సమస్య నుండి దారి మళ్లించామా లేదా అతడు దారి మళ్లించాడా అన్నది అఖిలేష్ యాదవ్ సమాధానం చెప్పాలి.
కోవిడ్ ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన తర్వాత మరియు దానిని నియంత్రించడంలో మోడీ జీ విజయం సాధించిన తర్వాత... ఇది తాత్కాలిక దశ అని అమిత్ షా అన్నారు.

Amith Shah On UP Election : మేము సమస్య నుండి దారి మళ్లించామా లేదా అతడు దారి మళ్లించాడా అన్నది అఖిలేష్ యాదవ్ సమాధానం చెప్పాలి. కోవిడ్ ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన తర్వాత మరియు దానిని నియంత్రించడంలో మోడీ జీ విజయం సాధించిన తర్వాత... ఇది తాత్కాలిక దశ అని అమిత్ షా అన్నారు.

Amith Shah On UP Election : మేము సమస్య నుండి దారి మళ్లించామా లేదా అతడు దారి మళ్లించాడా అన్నది అఖిలేష్ యాదవ్ సమాధానం చెప్పాలి. కోవిడ్ ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన తర్వాత మరియు దానిని నియంత్రించడంలో మోడీ జీ విజయం సాధించిన తర్వాత... ఇది తాత్కాలిక దశ అని అమిత్ షా అన్నారు.

ఇంకా చదవండి ...

Amit Shah Exclusive Interview to News18 : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హయాంలో ఉత్తరప్రదేశ్‌ లో దోపిడీలు, కిడ్నాప్ లు, అత్యాచారాలు మరియు భూకబ్జాలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్ లో మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికానంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర హోం మంత్రి మరియు సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా మాట్లాడుతూ.."గతంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ ప్రభుత్వ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం కూడా పెద్ద విషయం. నేను మే 2013 నుండి ఇప్పటి వరకు UPలోని ప్రతి జిల్లా మరియు బ్లాక్‌ లకు రోడ్డు మార్గంలో ప్రయాణించాను. యూపీలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఒకప్పుడు పెద్ద విషయం అని నేను మీకు చెప్పగలను. ఎస్పీ అధికారంలోకి వచ్చాక ఒక వర్గానికి చెందిన ప్రజలు తమ ఇష్టానుసారం చేసే అధికారం తమకు దక్కిందని భావించారు. పశ్చిమ యూపీలో ప్రజల ఇళ్ల నుండి గేదెలను తీసుకెళ్లారు మరియు రైతులు ఏమీ చేయలేకపోయారు. నిజానికి ఆ పరిస్థితిని చూశాను. చాలా మంది తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం మీరట్ నుండి ఢిల్లీకి వెళ్లారు. మీరట్ నుండి ప్రజలు వలస వెళ్లారు. కోట్ల రూపాయల విలువైన వారి భూములను గ్యాంగ్‌ స్టర్లు కబ్జా చేసేవారు" అని అమిత్ షా చెప్పారు.

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత..రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పాం. యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత...డెకాయిటీ 72 శాతం తగ్గింది. దోపిడీలు 62 శాతం తగ్గింది. కిడ్నాప్ లు 39 శాతం తగ్గాయి. అత్యాచారాలు 50శాతం తగ్గాయని. ఉత్తరప్రదేశ్‌లో ఇది చాలా ముఖ్యమైన అంశం అని అమిత్ షా అన్నారు. బీజేపీతో ప్రజలను కలుపుతున్న 4 పెద్ద సమస్యలు- శాంతిభద్రతలు, గరీబ్ కళ్యాణ్, అభివృద్ధి మరియు యూపీలో మేము పరిపాలనను మార్చిన విధానం పెద్ద ఇష్యూ. తమ సమస్యలు పరిష్కరించబడుతున్నాయని ప్రజలకు తెలియజేయడంలో మేము విజయం సాధించాం. లా అండ్ ఆర్డర్ కీలక అంశాల్లో ఒకటి. గరీబ్ కళ్యాణ్, అభివృద్ధి మరియు మెరుగైన పరిపాలనతో పాటు, శాంతిభద్రతలు వంటి అంశాలు బీజేపీకి ప్రజలు మద్దతు ఇచ్చేందుకు ఎక్కువగా దోహదపడతాయని షా అన్నారు.

ALSO READ Viral Video : గొప్పొడివయ్యా.. తనకు పాదాభివందనం చేయబోయిన నేత కాళ్లే పట్టుకున్న మోదీ

ఎస్పీ ఉన్నప్పుడు...ఒక మతానికి చెందిన వారికి స్వేచ్ఛనిచ్చేవారు. రైతుల ఇళ్ల నుంచి వాళ్లు పశువులను తీసుకెళ్లినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆజం ఖాన్, అతిక్ అహ్మద్ మరియు ముఖ్తార్ అన్సారీ ఇప్పుడు జైలులో ఉన్నారు. రెండు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి మాఫియా నుండి విముక్తి చేయబడింది. తమను వేధించే వ్యక్తులు జైలులో ఉంటారని ఉత్తరప్రదేశ్ ప్రజలు ఒకప్పుడు ఊహించలేరు. నేడు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏ జిల్లాలోనూ బాహుబలి, మాఫియా అనేవి లేవు, అంతకుముందు ఇది శాశ్వత లక్షణం. గ్యాంగ్‌ స్టర్లు ఎత్తుకెళ్లిన రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పుడు వారి నుంచి జప్తు చేశారు. ఇది గొప్ప విజయం మరియు ప్రజలు మా పనిని అభినందిస్తున్నారు అని అమిత్ షా చెప్పారు.

బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్‌ లో మహిళల భద్రత కూడా మెరుగుపడిందని అమిత్ షా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాన్పూర్‌ లో తాను అర్ధరాత్రి స్కూటీలపై రోడ్లపైకి వచ్చిన అమ్మాయిలను చూశానని..దీని పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. తాను దీన్ని తన హోటల్ కిటికీలోంచి చూశానన్నారు. ఇది గొప్ప విజయం మరియు ప్రజలు మా పనిని అభినందిస్తున్నారు.. మరియు అది ఓట్లలోకి మారుతుంది అని అమిత్ షా అన్నారు.

ALSO READ Collage Girl: రోజు కాలేజీకి తీసుకెళ్లే డ్రైవర్ ప్రేమ మత్తులో మునిగి.. చివరి ట్విస్టును భరించలేరేమో!!

సమాజ్‌వాదీ పార్టీ మరియు బీఎస్పీ UAPA(చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) మరియు POTA(ఉగ్రవాద నిరోధక చట్టం) కేసులను వారి వారి ప్రభుత్వ హయాంలో ఉపసంహరించుకోవడంపై షా విమర్శలు గుప్పించారు. UAPA మరియు POTA ఉపసంహరించుకున్న తర్వాత, వారు ఎవరికి సహాయం చేస్తున్నారు? మరియు ఎందుకు? తమ ఓటు బ్యాంకు కోసమా? ఇతరులకు ఓటు అడిగే హక్కు లేదా? బాధితులైన వారికి ఓటు లేదా? మొత్తం ఉత్తరప్రదేశ్‌లో ఇదే ఫీలింగ్‌. కాంగ్రెస్ కూడా తమ హయాంలో ఇలాంటి కేసులను ఉపసంహరించుకుంది అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా దేశమంతటా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని షా అన్నారు.

యూపీలో 15 సంవత్సరాల SP-BSP పాలన తర్వాత... ఆర్థిక వ్యవస్థ 8-9వ స్థానంలో ఉంది. 5 సంవత్సరాలలో తాము దానిని 2వ స్థానానికి చేర్చామని షా అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లలోపు మేము దానిని నంబర్ 1గా చేస్తాం. ఇది ఒక పెద్ద విజయం. యూపీ జీడీపీ ఇప్పుడు దాదాపు రెట్టింపు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 14 వ స్థానం నుంచి 2 వ స్థానానికి వచ్చాం. మేము సమస్య నుండి దారి మళ్లించామా లేదా అతడు దారి మళ్లించాడా అన్నది అఖిలేష్ యాదవ్ సమాధానం చెప్పాలి.

కోవిడ్ ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన తర్వాత మరియు దానిని నియంత్రించడంలో మోడీ జీ విజయం సాధించిన తర్వాత... ఇది తాత్కాలిక దశ అని అమిత్ షా అన్నారు.

ALSO READ CM KCR దూకుడు.. మరో పొలిటికల్ టూర్.. ఈసారి ఎక్కడికంటే.. కేసీఆర్‌కు Prakash Raj సెంటిమెంట్?

జరుగుతున్న యూపీ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో. విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అమిత్ షా ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని మోదీకి పాపులారిటీ పెరిగింది...ఇది బీజేపీకి మంచి ఫలితాన్ని తీసుకురానుందని ఆయన చెప్పారు. 2017 లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్వేలలో తమకు 238సీట్లు వస్తాయని చెప్పారని..కానీ తమకు 325 సీట్లు వచ్చాయని షా గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ..జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీతో పొత్తు పొత్తుకుంటుందా అని అడిగిన ప్రశ్నకు...ఆప్రశ్నే ఉత్పన్నం కాదు అని అమిత్ షా జవాబిచ్చారు. వెనుకబడిన తరగతులు విభజించబడ్డాయని ఒక ఇమెజ్ సృష్టించారని..తాను మూడు దశల్లో పర్యటించానని... మోడీ గారి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ పోల్ చిత్రాన్ని మార్చిందని చెప్పగలను అని షా అన్నారు.

కులాల ఈక్వేషన్స్ పై షా మాట్లాడుతూ..2019లో మొత్తం 4 పార్టీలు కలిసి ఉన్నాయి, కానీ మేము 64 లోక్‌ సభ స్థానాలను గెలుచుకున్నాము, రాజకీయాలు ఇలా పనిచేయవు. 2022లో కూడా ప్రధాని నాయకత్వంలో అఖండ మెజారిటీతో వస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు.

రైతులు తమతోనే ఉన్నారని..బీజేపీ రైతు వ్యతిరేకి అనే భావన కల్పించే ప్రయత్నం జరిగిందని..కానీ అది సఫలం కాలేదన్నారు.  యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ పార్టీ గురించి మాట్లాడుతూ - ముస్లిం యువకులలో ఆయన దృష్టి కేంద్రంగా ఉన్నారు, కానీ ప్రతిసారీ ఓట్లు పొందాల్సిన అవసరం లేదన్నారు.

First published:

Tags: Amit Shah, Union Home Ministry, UP Assembly Elections 2022

ఉత్తమ కథలు