(P.Mahender,News18,Nizamabad)
ఉత్తర తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆ రీజియన్ లోని అన్ని జిల్లాలతోపాటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన పట్టును మరింత పెంచుకునేందుకు పావులు కదుపుతుంది. కమలం జోరుకు కళ్లెం వేసేందుకు సీఎం కేసీఆర్ కవిత అస్త్రాన్ని వదలనున్నట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలో కారు పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అత్యంత కీలకం. అయితే ఈ ప్రాంతలో బీజేపీ తన బలాన్ని చాటుకుంటుంది. దీంతో జిల్లాకు కవితను మంత్రి చేస్తే ఉమ్మడి జిల్లాలో పట్టు నిలుపుకోవడం తోపాటు ప్రత్యర్థుల పైచేయి సాధించవచ్చనే దిశగా పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో మంత్రివర్గంలో కవితకు చోటు దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్ జిల్లా కోడలు.. సీఎం తనయ.. మాజీ ఎంపి, స్థానిక సంస్థల ఎమ్మేల్సీ కల్వకుంట్ల కవిత.. తన రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్ జిల్లా నుంచే మొదలు పెట్టింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొదటి సారి పార్లమెంట్ ఎన్నికల్లో అఖండావిజయం సాదించారు. మాజీ ఎంపి మదుయాష్కి గౌడ్ పై బారీ విజయం నమోదు చేసారు. పార్ల మెంట్ లో తెలంగాణ వాణి వినించింది శబాష్ అనిపించుకున్నారు. కానీ ఆనువ్యుయంగా 2019లో ఎంపిగా పోటి చేసి ధర్మపూరి ఆర్వింద్ చేతితో ఓటమిపాలయ్యారు. అయితే ఆమెకు ఆదరణ తగ్గలేదు. ఉమ్మడి జిల్లాలో కవితక్క అంటే బతుకమ్మ. బతుకమ్మ అంటే కవితగా అందరికి సుపరిచితురాలు. 2020 అక్టోబర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం బారీ విజయం సాదించారు. ఆనాటి నుంచి ఎమ్మెల్సీ కవితకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది..
2021 స్థానిక సంస్థల ఎమ్మేల్సీ ఎన్నికల్లో కవిత రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు పోటిగా నిలిచేందుకు ప్రతిపక్షలు సహసించాలేదు. అయితే ఉమ్మడి జిల్లాను అబివృద్దిలో నంబర్ వన్ స్థానంలో నిలబడటమే లక్ష్యమని కవిత రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్నితానై చూసుకుంటుంది. మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా కలిసేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్నరని సమాచారం. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది అనే విషయాలు నేరుగా తెలుసుకుంటున్నారు. దీంతో ఎమ్మేల్యేల పనితీరు కూడా తెలుస్తుంది.
ఉమ్మడి జిల్లాలో కవిత మరింతగా పట్టు బిగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే కవిత మంత్రిగా వస్తే ఉమ్మడి జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాల్లో ఎమ్మేల్యే అభ్యర్ధుల మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బిజెపిని ఎదుర్కొనే విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇచ్చేవిదంగా కవిత ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు కుతూరు ఎమ్మేల్సీ కవితను తన మంత్రి వర్గంలోకి తీసుకుంటే జిల్లావ్యాప్తంగా టిఆర్ఎస్ లకు మరింత బలం చేకురుతుందానే వాదన వినిపిస్తుంది. దీంతో జిల్లాలో బీజేపీకి చెక్ పెట్టవచ్చాని టీఆర్ఎస్ బావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎమ్మేల్సీ కవిత మంత్రి కావాలిని పార్టీ శ్రేణులు ఎంతో ఆశగా ఎదిరి చేస్తున్నారు. వారి కోరిక నేరవేరుతుందా? లేదా? చూడాలిమరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Kalvakuntla Kavitha, Nizamabad, Trs