Covid 19 Vaccine: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. వెల్లడించిన కేంద్ర మంత్రి

బిహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ తీవ్ర దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది.

news18-telugu
Updated: October 26, 2020, 11:17 AM IST
Covid 19 Vaccine: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్.. వెల్లడించిన కేంద్ర మంత్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బిహార్ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీ తీవ్ర దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు. కేవలం ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లోనే కాకుండా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను కేంద్రం ఉచితంగా అందజేస్తుందన్నారు. ఒడిశాలోని బాలసోర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని ఆయన అన్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తికి దాదాపు 500 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.

ఇక, బిహార్ ఎన్నికల సందర్భంగా.. బీజేపీ మేనిఫెస్టోలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇవ్వడం తీవ్ర దూమారానికి దారితీసింది. దేశవ్యాప్తంగా పలు పార్టీలు బీజేపీ హామీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్ కూడా ఈ హామీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు తమిళనాడు, మధ్యప్రదేశ్, అస్సాంలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. ఇక, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. దేశంలో ప్రలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ హామీపై ఒడిశా పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్‌పీ స్వైన్ ఆ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్, సారంగిలను ప్రశ్నించారు. ఒడిశా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఎందుకు ఇవ్వరో వివరణ ఇవ్వాలని అడిగారు. అలాగే ఒడిశాలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని అడిగారు.

ఇక, అక్టోబర్ 20న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత శాస్త్రవేత్తలు పలు వ్యాక్సిన్‌లను అభివృద్ది చేస్తున్నారని చెప్పారు. అవి ప్రస్తుతం వివిధ క్లినికల్ దశల్లో ఉన్నాయని అన్నారు. వాటి ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నట్టు వెల్లడించారు.
Published by: Sumanth Kanukula
First published: October 26, 2020, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading