బీహార్‌లో రాజకీయ వేడి...మహాకూటమిలో చేరాలని నితీశ్‌కు ఆర్జేడీ ఆహ్వానం

బీజేపీ-జేడీయు మధ్య విభేదాలు నెలకొన్నాయన్న కథనాల నేపథ్యంలో నితీశ్ కుమార్ మహాకూటమిలో చేరాలని ఆర్జేడీ ఆహ్వానిస్తోంది.


Updated: June 4, 2019, 11:27 AM IST
బీహార్‌లో రాజకీయ వేడి...మహాకూటమిలో చేరాలని నితీశ్‌కు ఆర్జేడీ ఆహ్వానం
బీహార్ సీఎం నితీశ్ కుమార్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్ర కేబినెట్‌లో తమ పార్టీకి(జేడీయూ) తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీ పట్ల గుర్రుగా ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్ర కేబినెట్‌లో చేరకూడదని జేడీయూ నిర్ణయించుకోవడం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారం తర్వాత తన మంత్రివర్గాన్ని విస్తరించిన నితీశ్ కుమార్..భాగస్వామ్య పార్టీ బీజేపీ నుంచి కేబినెట్ విస్తరణలో ఒక్కరికీ ప్రాతినిధ్యం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలనాటికి ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై బీహార్‌లో విపక్ష ఆర్జేడీ ఆచితూచి స్పందిస్తోంది. నితీశ్ కుమార్ తిరిగి మహాకూటమిలో చేరడం మంచిదని ఆర్జేడీ సీనియర్ నేత రఘువన్ష్ ప్రసాద్ సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకంకావాల్సిన అవసరం ఉందన్నారు. నితీశ్ కుమార్ కూడా మహాకూటమిలో చేరితే బీజేపీని ఓడించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.

అటు మరో ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ...కేంద్ర కేబినెట్‌లో జేడీయుకి తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో నెలకొన్న పరిస్థితులపై రఘువన్ష్ ప్రసాద్ ఆ రకమై వ్యాఖ్యలు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చన్న ఆయన...రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందేనని వ్యాఖ్యానించారు.

గత దశాబ్ధకాలంగా బీహార్ రాజకీయాలు నితీశ్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం ఏదైనా తీసుకుంటారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే బీహార్‌లో ఎన్డీయే సుస్థిరంగా ఉందని, ఎలాంటి గందరగోళం లేదని జేడీయు అధికార ప్రతినిధి అజయ్ అలోక్ వ్యాఖ్యానించారు.
First published: June 4, 2019, 11:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading