(P.Srinivas,News18,Karimnagar)
సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా సాగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప పోరులో విజయం సాధించిన దరిమిలా, ఈటల రాజేందర్ ((Etela Rajender) చరిష్మాను మరింతగా వాడుకుంటూ పార్టీకి లాభం చేకూర్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ మిగతా నేతలకు భిన్నంగా కీలకమైన ప్రజాసమస్యలపై సీఎం కేసీఆర్ (CM KCR) ను నిలదీస్తూ ఈటల ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చేలా బీజేపీ సరికొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నది. దీర్ఘకాలిక అవసరాల రీత్యా కూడా కీలకమైన ఆ వ్యూహం అమలులో రాజేందర్ కు కీలక నేతల సహకారాన్ని కూడా అందించాలని బీజేపీ డిసైడైంది. వివరాలివి..
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఇకపై దూకుడు పెంచాలనుకుంటున్నది . ఇతర పార్టీల నేతలను ఇప్పటివరకూ టీఆర్ఎస్ ఆకర్షించిన వ్యూహాన్నే ఇకపైన బీజేపీ అమలుచేయాలనుకుంటు న్నది . ఇందుకోసం అధికార పార్టీనే టార్గెట్ చేయాలని భావిస్తున్నది . ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి వారిని కమలం గూటికి తీసుకురావాలనుకుంటున్నది . హుజూరాబాద్ ఉప ఎన్నికకుముందే బీజేపీకి ఈ ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒకింత సీరియస్ గా దృష్టి పెట్టనున్నది . త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలనుంచే ఈవ్యూహాన్ని మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి కొలిక్కి తేవాలని టార్గెట్ పెట్టుకున్నది .
టీఆర్ఎస్ లో దీర్ఘకాలిక అనుభవం , పార్టీలోని నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఆ బాధ్యతను ఈటలకే అప్పజెప్పాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకు న్నది .టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి , అసమ్మతి ఉన్న నేతలపై ఈటల రాజేందర్ కే ఎక్కువ అవగాహన ఉన్నందున ఆయనకే ఈ బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు . దుబ్బాక , హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించిన జితేందర్ రెడ్డిని సైతం ఈ వ్యూహంలో భాగం చేయాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం .
టీఆర్ఎస్ ను డిఫెన్సులోకి నెట్టే వ్యూహం అధికార పార్టీని ఇరుకున పెట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీటుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ హుజూరాబాద్ గెలుపుతో స్పీడ్ పెంచనున్నది . నిత్యం టీఆర్ఎస్ ను ఏదో ఒక రూపంలో టెన్షన్కు గురిచేయాలని , బీజేపీ చుట్టే దాని దృష్టి ఉండేలా ఉక్కిరిబిక్కిరి చేయాలనేది ప్లాన్ . త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ల్లోనూ బీజేపీ అభ్యర్థుల్ని బరిలోకి దించాలనుకుం టున్నది .
సంఖ్యాపరంగా పెద్దగా బలం లేకపోయినప్పటికీ అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా క్రాస్ ఓటింగ్ భయాన్ని అధికార పార్టీలో కలిగించాలని అనుకుంటున్నది . కరీంనగర్ , నిజామాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశాన్ని ఆశించి భంగపడినవారితో సంప్రదింపులు జరిపి వారికీ టికెట్ ఇచ్చి కమలం గూటికి తీసుకొచ్చే పనితోనే ఈ వ్యూహాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నది . ఉద్యమకారులకు . పార్టీలో స్థానం లేదనే అసంతృప్తిని ఎలా వాడుకో వాలన్న దానిపై బీజేపీకి స్పష్టత ఉన్నది . అధికార పార్టీ అమలు చేయని గత హామీలను ప్రస్తుతం ప్రజలెదుర్కొంటున్న సమస్యలు , వడ్ల కొనుగోలు , నిరుద్యోగం , దళితబంధు .. ఇలా అన్నింటిపై ఆందో ళనలు చేపట్టాలనుకుంటున్నది ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Etela rajender, Karimnagar, Mlc elections, Telangana