హోమ్ /వార్తలు /National రాజకీయం /

karimnagar mlc elections : టీఆర్ఎస్ నేతలకు ఆడియో టేపుల టెన్షన్ -ఫోన్లో మాట్లాడలంటే భయం?

karimnagar mlc elections : టీఆర్ఎస్ నేతలకు ఆడియో టేపుల టెన్షన్ -ఫోన్లో మాట్లాడలంటే భయం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదో ఒక ఆడియో లీకవుతుండటం, అది రచ్చకు దారితీయం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న ఆడియోలు , రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్న నేతల పరువును గంగలో కలుపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతుండటంతో రాబోయే రోజుల్లో..

ఇంకా చదవండి ...

(P.Srinivas,News18,Karimnagar)

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు కొత్త భయాలు పట్టుకున్నాయి. జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోడానికి గులాబీ దళం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈనెల 10న ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ తరఫున ఎల్.రమణ, భాను ప్రకాశ్ రావులు బరిలో ఉండగా, టీఆర్ఎస్ రెబల్, ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సర్దార్ రవీందర్ సింగ్ సహా మొత్తం 10మంది పోటీలో నిలిచారు. ఏకగ్రీవంగా గెలవాల్సిన సీట్లలో పోటీ రావడంతో తలలు పట్టుకున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఫోన్లలో మాట్లాడటానికి కూడా జంకుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల ఆడియో సంభాషణలు ఇటీవల లీకవుతుండటం, వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న దరిమిలా గులాబీ నేతల్లో టెన్షన్ కనిపిస్తున్నట్లుంది. పూర్తి వివరాలివి..

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతల్లో గత కొద్ది రోజులుగా కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎక్కడ ఎవరితో ఎం మాట్లాడిన నాయకుయల ఫోన్ కాల్ వాయిస్ బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో ఫోన్ లో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. రాజకీయంగా ఈ లీకుల వలన చాలామంది టీఆరెఎస్ నాయకుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. లీకులిస్తున్నారా లేక ఆడియో లీకవుతుందా తెలియక నేతలంతా ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో సమయ సందర్భాలను బట్టి వ్యూహాలను రచిస్తుంటారు. అలాంటి వ్యూహాలను తమ క్యాడర్ తో పంచుకొని అభిప్రాయ సేకరణ చేస్తారు నేతలు. పదవుల అసంతృప్తి చెలరేగినప్పుడు క్యాడర్ చేజారకుండా నచ్చచెప్పి మాట్లాడుతుంటారు. ఐతే సదరు నాయకులు అందరిని కలవాలంటే విలుకాకపోవడం తో నేరుగా ఫోన్లో మాట్లాడే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు ఆ ఫోన్లే నేతల పాలిట శాపంగా మారాయి. తెర వెనుక బాగోతాన్ని ఆడియోలని జనం ముందు కు తీసుకువచ్చి నేతల పరువుతీస్తున్నాయి..

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్గతంలో కరీంనగర్ మంత్రి, అమ్మయితో చాటింగ్ లీకు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆలా మొదలైన లీకుల వ్యవహారం. హుజురాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కౌశిక్ రెడ్డి , ఒక కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీకయ్యి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది...ఆ ఆడియో కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. చివరకు ఎమ్మెల్యే టికెట్ కోల్పోయి.. ఎమ్మెల్సీ గా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ఇన్నాళ్లు కష్టపడ్డాం..ఇక సుఖపడుదాం అని తన కాంగ్రెస్ కార్యకర్తతో జరిపిన సంభాషనే ఆ ఆడియో సారాంశం. దీంతో అటు కాంగ్రెస్ ను వీడి ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ లేక మిగిలాల్సివచ్చింది. దీనికి కారణం ఆడియో లీకేజీనే.

konijeti rosaiah : వైఎస్సార్‌ను కత్తితో పొడిచి సీఎం అయ్యేవాడిని -రోశయ్య సంచలన వ్యాఖ్యలు -viral videoవివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఉన్న రసమయి బాలకిషన్ ఆడియో కూడా ఇటీవల లీకయ్యింది. భూ కబ్జా ఆరోపణలపై ఓ సర్పంచ్ ను ఎడా పేడా బుతులు తిడుతున్న ఆ ఆడియో కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా నష్టం జరగకపోయిన, వ్యక్తిగతంగా మాత్రం రసమయి ని బాగానే డ్యామేజి చేసిందా ఆడియో. తాజాగా కరీంనగర్ జిల్లాలో మరికొన్ని ఆడియో లీకులు సంచలనం రేపాయి. వివాదరహితుడిగా పేరున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. స్థానిక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్ని కాపాడుకునేందుకు ఇటీవల జరిపిన ఓ ఫోన్ సభాషణ లీకైంది. అందులో కొప్పుల.. టీఆర్ఎస్ స్థానిక నేతల్ని పరుష పదజాలంతో తిట్టడం ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఈ ఒక్క ఆడియో తో కొప్పుల దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చగా మారింది.

Siddipet : పసిపాప కాలిగజ్జెలకు కరెంట్ షాక్ పెట్టి.. కన్నతండ్రి క్రూరత్వం.. భార్యపై అనుమానంతో ఇలా..ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదో ఒక ఆడియో లీకవుతుండటం, అది రచ్చకు దారితీయం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న ఆడియోలు , రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్న నేతల పరువును గంగలో కలుపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతుండటంతో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్ని ఆడియో రికార్డులను బయటికొస్తాయోననే చర్చ జరుగుతోంది.

First published:

Tags: Karimnagar, Mlc elections, Trs

ఉత్తమ కథలు