Huzurabad: మరో దుబ్బాక కానుందా? -TRS సర్వేలు ఏం చెబుతున్నాయి? -దళిత బంధు ఓట్లు రాల్చేనా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి

Huzurabad bypoll : ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ది చేకూరేందుకే దళిత బంధు పథకాన్ని తెచ్చామని సీఎం కేసీఆర్ బాహాటంగా ప్రకటించుకున్నా, నియోజకవర్గంలోని ఎస్సీ ఓటర్లను ఆ పథకం ఆకట్టుకోలేమో అనే భావన టీఆర్ఎస్ ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారిన ఈ ఎన్నికలో ఈటల బలాబలాలపై టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు చేయిస్తున్న సర్వేల్లో వెల్లడవుతోన్న ఫలితాల ఆధారంగా, హుజూరాబాద్ మరో దుబ్బాక కారాదని గులాబీ దళం తీవ్రంగా ప్రయత్నిస్తోంది..

 • Share this:
  (P.Srinivas, News 18, Karimnagar)
  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక (Huzurabad bypoll) తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నాయకులను తీవ్ర ఆలోచనలో పడేస్తోంది . దాదాపు గత ఐదు మాసాలుగా ఈ నియోజకవర్గంలోనే అధికార పార్టీ ముఖ్య గణమంతా ఈ నియోజకవర్గంలోనే తిష్ట వేసుకుని కూర్చున్నప్పటికీ ఓటరు నాడిని పసిగట్టడంలో సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు . ఈటల రాజేందర్ (Etela Rajender) రాజీనామా చేసిన అనంతరం టిఆర్ఎస్ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ముఖ్య నేతలు హుజురాబాద్ లోని అన్ని మండలాలు , గ్రామాల్లో పర్యటించారు . అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల పేరిట పనుల ప్రారంభోత్సవాలు , పెన్షన్లు , దళిత బంధు (Dalit Bandhu) వంటి కార్యక్రమాలను చేపట్టారు . అయినప్పటికీ తాము చేపట్టిన కార్యక్రమాల వల్ల తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయా అన్న విషయమై తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నారు .

  దళిత బంధు గట్టెక్కించేనా?
  రాష్ట్రంలోనే ప్రథమంగా హుజూరాబాద్ లోనే అమలు చేసిన దళిత బంధు పథకం తమను గట్టెక్కిస్తోందని భావించిన టిఆర్ఎస్ అధిష్టానం విషయంలో పూర్తి నమ్మకంతో వ్యవహరించడం లేదని సమాచారం . నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు అధికంగానే ఉన్నా ఈ పథకం అమలు విషయంలో ఉన్న అనుమానాలు తమకు ఎలాంటి ఫలితాలను ఇవ్వనున్నాయో అనే విషయమై ఆ పార్టీ నాయకులు బేరీజు వేసుకుంటున్నారు . దీంతో పాటుగా ఇతర సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు , ఆయా సందర్భాల్లో చేపట్టిన కమ్యూనిటీ హాళ్ల పనులు ప్రారంభాలు , నిధుల కేటాయింపు అంశాలతో తమకు మద్దతు లభిస్తుందా .. ? అన్న విషయంపైనా ముఖ్య నాయకుల చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి .

  దుబ్బాక రిపీట్ కావొద్దనే..
  ఏది ఏమైనా గతంలో జరిగిన దుబ్బాక ఎన్నిక ఫలితాలు హుజురాబాద్లో పునరావృతం కాకూడదని , అందుకు తగినట్టుగా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ ప్రాంత నాయకులకు ఉపదేశాలు ఇస్తున్నట్లు సమాచారం . కెసిఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగురేసిన ఈటల ఎన్నికల బరిలో ఉండడం , ఈ ఎన్నికలను వచ్చే శాసనసభ ఎన్నికలకు రెఫరెండంగా ప్రచారం చేసుకుంటుండడంతో ఈ సమయంలో విజయం సాధించడమే టిఆర్ఎస్ ప్రాభవాన్ని నిలబెట్టే అంశంగా పరిణమించింది . ఇదే విషయమై టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం . స్వయానా ఆయన మేనల్లుడు , ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపినా , నియోజక వర్గంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచా రాన్ని తెలుసుకుంటున్నట్లు సమాచారం .

  ఈటెలకు అది కలిసిరానుందా.. ధర్మం అధర్మానికి మధ్య నడుస్తున్న యుద్ధం లో ఎన్నికల గెలుపు ఎవరిది..?


  ఈటలకు సానుకూలత ఎంత?
  హుజూరాబాద్ లో ఎన్నికల కోడ్ అమలైన నాటి నుంచి చోటుచేసుకుంటున్న పరిస్థితులు , ప్రత్యర్థి పార్టీల ప్రచారం సాగుతున్న తీరుపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది . ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు పోలీసు శాఖలోని ఇతర విభాగాలకు చెందిన సిబ్బందితో ప్రత్యేక సర్వేలు చేపడుతూ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం . ప్రజల్లో ఈటల రాజేందర్ పట్ల ఉన్న సానుకూల అంశాలు , అదే రీతిన టిఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేక అంశాల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ప్రజల మధ్యకు పంపిస్తున్నట్లు తెలిసింది . నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులకు అనుకూలంగా పావులు కదుపుతూ హుజురాబాద్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న దిశగా టిఆర్ఎస్ అడుగులు వేస్తోంది .

  KT RamaRao: హుజూరాబాద్‌కు కేటీఆర్ దూరంగా ఉండబోతున్నారా ?.. టీఆర్ఎస్ వ్యూహమేంటి ?


  కేటీఆర్ వ్యాఖ్యలు కొంప ముంచుతాయా?
  ఇదిలా ఉండగా హుజురాబాద్ ఎన్నికలపై తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికలు అసలు అవి మాకు పోటీ కాదు.. గెలిస్తే ఒక సీటు పెరుగుతుంది. ఓడిపోతే ఒక సీటు తగ్గుతుంది తప్ప.. ఎన్నికల వల్ల మాకు వచ్చిన నష్టం లేదని కేటీఆర్ ఈ విధంగా చెబుతున్నాడు. కేసీఆర్ ఏమో సర్వేలు చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికను ప్రగతి భవన్ కు చెప్పించుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్లకు ముందు నామినేషన్ అయిన తర్వాత, హుజురాబాద్ లో టిఆర్ఎస్ కు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందని, ఇంటిలిజెంట్ సర్వేలు మొదలు అయినవి.. సర్వే రిపోర్ట్ లు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటే ఈ నెలలో కెసిఆర్ రెండు భారీ బహిరంగ సభలు, పెట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నారు.
  Published by:Madhu Kota
  First published: