Karnataka Crisis : అర్థరాత్రి హైడ్రామా.. ఈరోజైనా విశ్వాస పరీక్ష జరిగేనా..?

కుమారస్వామి,యడ్యూరప్ప(File)

బీజేపీ పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప బీజేపీ సభ్యులందరికీ చాక్లెట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..తాము మహిళలం అని, సభను వాయిదా వేస్తే ఇంటికి వెళ్తామని స్పీకర్‌తో చెప్పారు. బీజేపీ మహిళా ఎమ్మెల్యేలు మాత్రం సభను కొనసాగించాల్సిందే అన్నారు.

 • Share this:
  కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. సోమవారం విశ్వాస పరీక్ష పూర్తి చేస్తానని స్పీకర్ ప్రకటించినప్పటికీ.. చివరకు మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం 10గంటలకు తాను సభలో ఉంటానని చెప్పిన స్పీకర్.. సాయంత్రం 4గంటల లోపు విశ్వాస పరీక్ష పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. తాను సభలోకి వచ్చిన తర్వాత.. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేసేది లేదని.. వెంటనే విశ్వాస పరీక్ష మొదలుపెడుతానని చెప్పారు.మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం మాత్రం విశ్వాస పరీక్షకు తమకు మరింత సమయం కావాలని కోరుతున్నాయి.

  సోమవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్-జేడీఎస్,బీజేపీ సభ్యులు అసెంబ్లీలోనే ఉన్నారు. అప్పటికీ సభను వాయిదా వేయవద్దని ఇరుపక్షాలు కోరడం గమనార్హం. అదే సమయంలో సీఎం కుమారస్వామి.. సోషల్ మీడియాలో తన రాజీనామా గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తన పేరిట సోషల్ మీడియాలో
  సర్క్యులేట్ అవుతున్న ఫేక్ రాజీనామా లేఖను స్పీకర్‌కు చూపించారు.అర్ధరాత్రి వరకు సభ్యులంతా సభలోనే ఉండటంతో.. డిన్నర్ కూడా అక్కడే చేసినట్టు సమాచారం.బీజేపీ పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప బీజేపీ సభ్యులందరికీ చాక్లెట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..తాము మహిళలం అని, సభను వాయిదా వేస్తే ఇంటికి వెళ్తామని స్పీకర్‌తో చెప్పారు. బీజేపీ మహిళా ఎమ్మెల్యేలు మాత్రం సభను కొనసాగించాల్సిందే అన్నారు.

  మొత్తం మీద సీరియల్ ఎపిసోడ్స్‌లా కర్ణాటక రాజకీయ సంక్షోభం ఎడతెగకుండా సాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో మంగళవారం రోజైనా దీనికి తెరపడుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 10గంటలకు విశ్వాస పరీక్ష మొదలుపెడుతానని స్పీకర్ చెబుతున్నప్పటికీ..సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది.
  First published: