'రాహుల్ భారతీయుడు కాదు'..నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు

రౌల్ వింకీ, రాహుల్ గాంధీ ఒక్కరేనా? వేర్వేరా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ కాకుంటే రాహుల్ గాంధీ ఒరిజినల్ సర్టిఫికెట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: April 20, 2019, 9:44 PM IST
'రాహుల్ భారతీయుడు కాదు'..నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు
రాహుల్ గాంధీ
news18-telugu
Updated: April 20, 2019, 9:44 PM IST
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి ధృవ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అఫిడఫిట్‌లో పేర్కొన్న వివరాలు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నామినేషన్ పరిశీలనను రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా ఈ నెల 22కు వాయిదావేశారు. ఇప్పుడీ వ్యవహారం దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

మేం ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తాం. బ్రిటన్‌లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ ప్రకారం రాహుల్ గాంధీ ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయులు కాని పౌరులకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. ఏ ప్రాతిపదికన రాహల్ గాంధీ బ్రిటన్ పౌరుడయ్యారు? ఇప్పుడు భారతీయుడు ఎలా అయ్యారు? దీనిపై స్పష్టత వచ్చే వరకు రాహుల్ గాంధీ నామినేషన్‌ను ఆమోదించకూడదని రిటర్నింగ్ అధికారిని కోరాం.
రవిప్రకాశ్, ధృవ్‌లాల్ లాయర్
బ్రిటన్‌ కంపెనీకి సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదని రవిప్రకాశ్ ఆరోపించారు. విద్యార్హత పత్రాల్లోనూ తప్పులన్నాయని ఫిర్యాదుచేశారు. కాలేజీల్లో 'Raul vinci' పేరుతో ఉన్నారని.. రాహుల్ గాంధీ పేరుతో ఆయనకు ఎలాంటి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు లేవని స్పష్టంచేశారు అమేథీ ఇండిపెండెంట్ అభ్యర్థి. రౌల్ వింకీ, రాహుల్ గాంధీ ఒక్కరేనా? వేర్వేరా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ కాకుంటే రాహుల్ గాంధీ ఒరిజినల్ సర్టిఫికెట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఐతే రాహుల్ నామినేషన్‌పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కాగా, రాహుల్ గాంధీ అమేథీతో పాటు వయనాడ్‌లోనూ పోటీచేస్తున్నారు. వయనాడ్‌లో ఏప్రిల్ 23న మూడోదశలో భాగంగా పోలింగ్ జరుగుతుండగా...అమేథీలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 23 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...