చంద్రబాబుది ఓవర్‌యాక్షన్.. కడిగిపారేసిన అంబటి రాంబాబు

Ambati Rambabu on Chandrababu and Lokesh : ఇటీవల గుంటూరు శరణార్థుల శిబిరాన్ని సందర్శించిన లోకేష్.. రాష్ట్రంలో రాజన్న పాలన కాదు.. రాక్షస పాలన అంటూ విమర్శించారని.. మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఆయనకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

news18-telugu
Updated: September 7, 2019, 11:54 AM IST
చంద్రబాబుది ఓవర్‌యాక్షన్.. కడిగిపారేసిన అంబటి రాంబాబు
అంబటి రాంబాబు (File Photo)
news18-telugu
Updated: September 7, 2019, 11:54 AM IST
వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.చంద్రబాబు ఓవర్‌యాక్షన్ కార్యక్రమాలు చేస్తూ.. ప్రజల మీద బలవంతంగా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.మొన్నటికిమొన్న ఓ సినీ ఆర్టిస్టుతో వేషం వేయించి ప్రభుత్వంపై విషం కక్కించారని.. ఇప్పుడు గుంటూరులో శిబిరాన్ని ఏర్పాటు చేసి అందులో కొంతమందిని పెట్టి.. వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2002లో మాచర్లలో ఏడు హత్యలు జరిగినప్పుడు రాష్ట్రంలో చంద్రబాబే సీఎంగా ఉన్నాడని.. అప్పుడేం చేశారని ప్రశ్నించారు. శరణార్థుల శిబిరాల పేరుతో చంద్రబాబు రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

2014లో చంద్రబాబు అధికారం చేపట్టాక.. మొదట ఐదు పథకాలకు సంతకాలు చేశారని.. కానీ ఐదేళ్ల పాలనలో వాటిని పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. రైతు రుణమాఫీ,ఎన్టీఆర్ సుజల స్రవంతి,ఫించన్లు,ఉద్యోగుల వయసు పెంపు వంటి హామీలను నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అనేక బిల్లులు,చట్టాలు,పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. గతంలో బాబు వస్తే.. జాబు వస్తుందని ఒక్కరికీ ఉపాధి చూపించలేదని మండిపడ్డారు. కానీ జగన్ సీఎం అయ్యాక 4లక్షల మంది యువకులకు ఉపాధి కల్పించామన్నారు. ఇందులో 1,20,000 శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఇటీవల గుంటూరు శరణార్థుల శిబిరాన్ని సందర్శించిన లోకేష్.. రాష్ట్రంలో రాజన్న పాలన కాదు.. రాక్షస పాలన అంటూ విమర్శించారని.. మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఆయనకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్వచ్చమైన,నీతివంతమైన పాలన జరుగుతోందనే అక్కసుతోనే బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,లోకేష్ ఇకనైనా వాస్తవాలు గుర్తించే ప్రజలపై తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దే పనులు మానుకోవాలని సూచించారు.First published: September 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...