‘ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు యాత్ర’

చంద్రబాబు తన మాజీ పిఎస్ పై వచ్చిన అక్రమాలపై ఎందుకు స్పందించలేదని అంబటి ప్రశ్నించారు.

news18-telugu
Updated: February 19, 2020, 7:09 PM IST
‘ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు యాత్ర’
చంద్రబాబు, అంబటి రాంబాబు
  • Share this:
ఐటి దాడులనుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు యాత్ర చేపట్టారని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేదని...యాత్రపేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు తోకలు కత్తిరిస్తానంటున్నారని....ఎవరి తోకలు ఎవరు కత్తిరించారో ప్రజలకు తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. ఐటి దాడులపై మీడియాకు దొరక్కుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎవరూ లెక్కచేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు తన మాజీ పిఎస్ పై వచ్చిన అక్రమాలపై ఎందుకు స్పందించలేదని అంబటి ప్రశ్నించారు.

పిఎస్‌ను పట్టుకుంటే రూ. 2 వేల కోట్ల అక్రమాలు బయటపడ్డాయని అన్నారు. రోజుకో డ్రామాతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని... పచ్చమీడియాతో కలసి శవరాజకీయాలు చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో డబ్బు ప్రవహాన్ని తగ్గించాలని సిఎం జగన్ ఆలోచిస్తున్నారని... డబ్బులు ఖర్చు పెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.


First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు