అలా చేయండి... ఆ కిక్కే వేరు... వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

సీఎం జగన్ హిందూవ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని... తన పాదయాత్రకు ముందు జగన్ శ్రీవారిని దర్శించుకున్నారని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

news18-telugu
Updated: November 15, 2019, 2:50 PM IST
అలా చేయండి... ఆ కిక్కే వేరు... వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్
అంబటి రాంబాబు (File)
  • Share this:
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక కొరతపై చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అని అంబటి రాంబాబు విమర్శించారు. ఆరు నెలలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబులో ప్రస్టేషన్ పెరిగిపోయిందని ఆరోపించారు. 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే చంద్రబాబు కంగారు పడుతూ అందర్ని కంగారు పడమని చెబుతున్నారని అంబటి అన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజిలు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.

సీఎం జగన్ హిందూవ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని... తన పాదయాత్రకు ముందు జగన్ శ్రీవారిని దర్శించుకున్నారని అంబటి గుర్తు చేశారు. అసలు రాజకీయాలలో మతప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. జగన్ గారికి అటు ఇటు అయితే మీ పరిస్దితి ఏంటి అని పవన్ కల్యాణ్ అడుగుతున్నారని... అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్‌ను ఏం చేయాలని అనుకుంటున్నారని అంబటి నిలదీశారు. .నీవు, చంద్రబాబు కలసి జగన్ గారిని ఏం చేయదలుచుకున్నారు.

ఎవరో ఆయిల్ కొడితే మీ బండి నడుపుుకుంటుంటే ఎలా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన అంబటి... మీ ఆయిలే మీరు కొట్టుంచుకుని బండినడుపుకుంటే ఎంతో బాగుంటుందని... అలా చేస్తే ఆ కిక్కే వేరు అని అన్నారు.23 క్లైమోర్ మైన్స్ పెట్టినా భయపడలేదని చంద్రబాబు చెబుతున్నారని... .వాటికి భయపడలేదుగాని ఒక్క కేసిఆర్ ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయివచ్చేశారని అంబటి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా ఏమైనా పంపించి ఉంటాడనేది తన అనుమానమని అన్నారు. ఢిల్లీ వెళ్లివచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నానని అన్నారు. చంద్రబాబు ఇసుక దీక్షకు మెజారిటి టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదని అంబటి గుర్తు చేశారు.



First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com