Andhra Pradesh: చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా ఎస్ఈసీ.. అప్పుడెందుకు అలా చేయలేదన్న వైసీపీ

Andhra Pradesh: టీడీపీతో కుమ్మక్కై ఎస్ఈసీ పనిచేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని అంబటి రాంబాబు అన్నారు.

news18-telugu
Updated: October 28, 2020, 5:41 PM IST
Andhra Pradesh: చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా ఎస్ఈసీ.. అప్పుడెందుకు అలా చేయలేదన్న వైసీపీ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అంబటి రాంబాబు
  • Share this:
ఎస్‌ఈసీని చంద్రబాబు నిమ్మగడ్డల కమిషన్‌గా మారుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన అన్నారు. రాజకీయ పక్షాలతో మాట్లాడాలనే నిర్ణయానికి ముందే ఎందుకు ప్రభుత్వంతో చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో రోజు కేవలం మూడు, నాలుగు కరోనా కేసులు ఉంటే ఇవాళ 3వేల కేసులు ఉన్నాయని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలు జరగాలని గతంలో ప్రభుత్వం భావిస్తే.. ఆ ప్రక్రియను అర్థాంతరంగా వాయిదా వేశారని గుర్తు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఇదే ప్రక్రియను ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో ఎందుకు పాటించలేదని అంబటి గుర్తు చేశారు. ఎన్నికలు వాయిదా వేయాలా..కొనసాగించాలా అని రాజకీయ పక్షాలను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇది ఎన్నికల కమిషన్‌ కాదని.. చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా మారుస్తున్నారని అన్నారు. గతంలో నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని.. ఆ లేఖలో ప్రభుత్వ ఆర్డినెన్స్‌ గురించి రాశారని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై చట్టం చేస్తే ఆయనకేం సంబంధమని అన్నారు. ఎస్‌ఈసీని ఓ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేలా నిమ్మగడ్డ రమేష్‌ బాబు వ్యవహరిస్తున్నారని అంబటి విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి తాము వెళ్లడం లేదని, ఈ సమావేశానికి బహిష్కరిస్తున్నామని నిన్ననే స్పష్టంగా చెప్పామని అంబటి రాంబాబు తెలిపారు.

టీడీపీతో కుమ్మక్కై ఎస్ఈసీ పనిచేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ భయపడదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్‌ కాంగ్రెస్సే అని అన్నారు. కరోనా రెండో దశ మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలున్నాయని అన్నారు. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని... స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని...టీడీపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదమని అంబటి రాంబాబు విమర్శించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 28, 2020, 5:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading