కడప జిల్లా నేతకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి, కేబినెట్ మంత్రి హోదా

వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. వ్యవసాయానికి సంబంధించిన అంబటి కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు.

news18-telugu
Updated: August 27, 2020, 5:32 PM IST
కడప జిల్లా నేతకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి, కేబినెట్ మంత్రి హోదా
వైఎస్ జగన్
  • Share this:
Advisors to Andhra Pradesh Govt | ఆంధ్రప్రదేశ్‌లో మరో సలహాదారును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణా రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. వ్యవసాయానికి సంబంధించిన అంబటి కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. అంబటి కృష్ణారెడ్డి కేబినెట్ మంత్రి స్థాయి హోదా కలిగి ఉంటారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు సంవత్సరాల పాటు ఆయన సలహాదారుగా కొనసాగుతారు. అంబటి కృష్ణారెడ్డికి నెలకు రూ.14,000 వేతనం అందించనున్నారు. అలవెన్సులు రూ.15,000 ఇస్తారు. సొంత కారు ఉంటే దానికి పెట్రోల్ కోసం నెలకు రూ.30,000 చెల్లించనుంది ప్రభుత్వం. ఇంటి అద్దెకు నెలకు రూ.లక్ష, మంత్రులకు ఎలాంటి మెడికల్ రీయింబర్స్ ఉంటాయో అలాంటి సదుపాయాలు, సెక్యూరిటీ నియామకం కోసం నెలకు రూ.25,000 చెల్లించనుంది ప్రభుత్వం. ఇల్లు ఊడ్చే వారికి నెలకు రూ.6000 ఇస్తారు.

అంబటి కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవడానికి రూ.10 లక్షలు లోన్ లేదా అడ్వాన్స్‌గా ప్రభుత్వం ఇవ్వనుంది. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కోసం రూ.50,000, ఫర్నీచర్ కోసం రూ.3,00,000, వంట సామగ్రి కోసం రూ.1,50,000 లోన్ అందించనున్నారు.  అంబటి కృష్ణారెడ్డికి ప్రైవేట్ సెక్రటరీ (1), అడిషనల్ పీఏ (1), బయటి నుంచి మరో పీఏ (1), ఆఫీసు సబార్డినేట్స్ (3), జామేదార్ (1), అదనపు డ్రైవర్ (1), డ్రైవర్ (1) చొప్పున సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. అలాగే, ప్రభుత్వం తరఫున రెండు ఫోన్ కనెక్షన్లు కూడా అందిస్తారు. వాటిలో ఒకదానికి ఎస్టీడీ సౌకర్యం ఉంటుంది.

ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు రామచంద్రమూర్తి రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు. రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్ట్. ఆయన పలు పత్రికలకు ప్రధాన సంపాదకులుగా పని చేశారు. వైపీసీ అధికారంలోకి వచ్చాక రామచంద్రమూర్తిని ప్రజా విధానాల సలహాదారు పదవిలో నియమించింది. అయితే ఆయన రాజీనామా వెనక అసలు కారణాలు తెలియరాలేదు. రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. వీరిలో పది మందికి కేబినెట్‌ హోదా కూడా ఉంది. తాజాగా, మరొకరిని ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 27, 2020, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading