Video: కిషన్ రెడ్డి కాళ్లపై పడిన అమరావతి రైతులు...

అమరావతికి సంబంధించి బీజేపీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి అమరావతికి అనుకూలంగా మాట్లాడుతుండగా, ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: January 5, 2020, 2:36 PM IST
Video: కిషన్ రెడ్డి కాళ్లపై పడిన అమరావతి రైతులు...
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అమరావతి రైతులు
  • Share this:
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి కోరారు. అమరావతి నుంచి కొందరు రైతులు హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో ఉన్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లారు.అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ కిషన్ రెడ్డిని మహిళా రైతులు వేడుకున్నారు. కిషన్ రెడ్డి‌తో మాట్లాడుతున్న సమయంలోనే మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ కిషన్ రెడ్డి కాళ్లను పట్టుకుని ప్రాధేయపడ్డారు. వెంటనే వారిని వారించిన కిషన్ రెడ్డి.. రైతులకు సాయం చేస్తానని చెప్పారు. అమరావతికి సంబంధించి బీజేపీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి అమరావతికి అనుకూలంగా మాట్లాడుతుండగా, మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాత్రం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కూడా రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించినదేనని తెలిపారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన బాటపడుతున్నారు. రాజధాని రైతుల తరఫున జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తోంది. కొన్ని రోజుల క్రితం సకల జనుల సమ్మె చేపట్టారు. తాజాగా అమరావతి బంద్‌కు పిలుపునిచ్చారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: January 5, 2020, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading