కీలక నిర్ణయం తీసుకున్న అమరావతి రైతులు...

రేపు అమరావతి బంద్‌కు రైతులు పిలుపునిచ్చారు. అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: February 21, 2020, 6:51 PM IST
కీలక నిర్ణయం తీసుకున్న అమరావతి రైతులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతిలో రైతులు సడన్‌గా ఓ నిర్ణయాన్ని ప్రకటించారు. రేపు అమరావతి బంద్‌కు పిలుపునిచ్చారు. అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలని జేఏసీ కోరింది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సుమారు 65 రోజులుగా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అమరావతిలో కొందరు డ్రోన్ కెమెరాలు వినియోగించడం కూడా పెద్ద దుమారానికి దారి తీస్తోంది. గ్రామాల్లో మహిళలు స్నానం చేస్తుంటే, డ్రోన్ కెమెరాలు వినియోగించి వాటిని చిత్రీకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు.

మరోవైపు గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై ప్రత్యర్థులు దాడి చేశారు. కోటప్పకొండ... కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే రజనీ మరిది గోపీ... కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఐతే... కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దుండగులు... కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దాంతో కారు ధ్వంసమైంది. తీరా చూస్తే... అందులో రజనీ లేరనీ... ఆమె మరిది గోపీ మాత్రమే ఉన్నారని తెలియడంతో... ప్రత్యర్థులు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో... వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో... ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు, వైసీపీ కార్యకర్తలూ కొట్టుకున్నట్లు తెలిసింది. చివరకు రెండు వర్గాల వారికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఐతే... కారుపై టీడీపీ కార్యకర్తలే దాడికి దిగారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో రాజకీయ వేడి రగులుతోంది.

నిన్న ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. అయితే రోజా అక్కడికి వస్తున్న తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు... అక్కడికి చేరుకున్నారు. సమ్మిట్ జరుగుతున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు, రైతుల ఆందోళనతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న కొందరు మహిళా ఆందోళనకారులు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. పోలీసులు వారిని అడ్డగించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Published by: Ashok Kumar Bonepalli
First published: February 21, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading