అమరావతిలో నాలుగోరోజు దీక్షలు... ప్రభుత్వంపై భగ్గుమంటున్న రైతులు

రాజధానిని అమరావతి నుంచీ తరలించి... విశాఖలో పరిపాలనా రాజధానిని పెడుతున్నారన్న ఆగ్రహంతో అమరావతి రైతులు రగిలిపోతున్నారు.

news18-telugu
Updated: December 21, 2019, 7:43 AM IST
అమరావతిలో నాలుగోరోజు దీక్షలు... ప్రభుత్వంపై భగ్గుమంటున్న రైతులు
రైతుల ఆందోళన
  • Share this:
ఏపీ రాజధానిపై GN రావు కమిటీ నివేదికతో అమరావతి ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. శుక్రవారం కమిటీ ప్రెస్‌మీట్ పెట్టగానే... అమరావతి, తుళ్లూరులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రైతులంతా రోడ్లపైకి వచ్చి... అసెంబ్లీవైపు ఆందోళనలు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు మందడం లైబ్రరీ సెంటర్‌లో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. అలాగే... 8న్నరకి వెలగపూడిలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు. అదే సమయంలో తుళ్లూరులో మహాధర్నా జరగబోతోంది. 9 గంటలకు రాయపూడిలో వంటావార్పూ కార్యక్రమం నిర్వహించి... తమ నిరసనను వ్యక్తం చేస్తామని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలనీ... అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే... ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో రాజధానిపై ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల ఈ లోగా జరిగే నిరసనలు, వ్యక్తమయ్యే అభిప్రాయాల్ని బట్టీ... ప్రభుత్వ నిర్ణయం ఉండే అవకాశాలున్నాయి.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు