‘కాపురం ఏం చేస్తారు.. మా దగ్గర పడుకోండంటున్నారు...’ అమరావతి రైతులపై మహిళా పోలీసుల ఫిర్యాదులు

‘డ్యూటీలో మహిళా పోలీస్ సిబ్బంది వద్దకు వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. మీరు భర్తలతో ఇంకేం కాపురం చేస్తారు. మా దగ్గర పడుకోండని అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.’ అని మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: January 12, 2020, 3:33 PM IST
‘కాపురం ఏం చేస్తారు.. మా దగ్గర పడుకోండంటున్నారు...’ అమరావతి రైతులపై మహిళా పోలీసుల ఫిర్యాదులు
జాతీయ మహిళా కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేస్తున్న మహిళా పోలీసులు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులతో ఆ ప్రాంతంలోకి కొందరు అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాజధానిలో నిరసన తెలుపుతున్న మహిళా రైతులపై పోలీసుల దాడులు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో జాతీయ మహిళా కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకుని ఇవాళ విచారణకు కమిటీని పంపింది. ఆ కమిటీ ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు మహిళా పోలీసులు. గుంటూరు రూరల్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. మాణిక్యాల రావు, మహిళా సిబ్బంది అయిన సంధ్యారాణి, అనంత కృష్ణ, శిరీషా, కుమారి, వెంకటేశ్వరమ్మ, అప్పమ్మ, పద్మ, శ్యామల, వీరనాగులు, సంఘం సభ్యులు వెంకటేశ్వర రావు, లక్ష్మయ్య జాతీయ మహిళా కమిషన్ సీనియర్ కోఆర్డినేటర్ కాంచెన్ ఖత్తర్‌ను కలసి తమ బాధలను గురించి వినతి పత్రం అందజేశారు.

మహిళా పోలీసులు అందించిన వినతిపత్రంలోని అంశాలు...


  • డ్యూటీలకు వెళ్లిన మహిళా సిబ్బందిని గ్రామాల్లో రోడ్లపై నిలబడి ఉండగా మా గ్రామం ఎందుకు వచ్చారు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతున్నారు.

  • డ్యూటీలో సిబ్బందికి గ్రామాల్లో మంచినీరు కొనుక్కొని షాపుల్లో తాగనీయకుండా చేస్తూ మా గ్రామంలో మీకేమీ ఇవ్వం అని ఇబ్బందులు పెడున్నారు.  • ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు డ్యూటీలో ఉన్న సిబ్బంది మోటార్ సైకిళ్ల గాలి తీస్తున్నారు

  • డ్యూటీలో మహిళా పోలీస్ సిబ్బంది వద్దకు వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. మీరు భర్తలతో ఇంకేం కాపురం చేస్తారు. మా దగ్గర పడుకోండని అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.
  • మహిళా పోలీస్ సిబ్బంది కొందరు గర్భవతులు, పెద్దవయసు వారు, ఆరోగ్యం బాగాలేని వారు ఉన్నారు. వారు ఎక్కుసేపు నిలబడలేక ఎక్కడైనా కూర్చుందామని వెళితే వారు కూర్చున్న చోట ఆయిల్ నీళ్ల, కారం పొడి చల్లుతున్నారు. అదేమని అడిగితే మా గ్రామం విడిచి వెళ్ళండంటున్నారు.

  • కనీసం ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి కూర్చుందామన్నా వాటికి కూడా తాళాలు వేస్తున్నారు

  • U/s 144 Cr PC మరియు 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉండగా జనం గుంపుగా రాగా వారిని వెళ్లనీయకుండా విధులు నిర్వహిస్తున్న మహిళలపైకి గుంపుగా వచ్చి మహిళా సిబ్బంది బట్టలు చించుట, చేతులతో కొట్టుట, గిచ్చుట, కొరుకుట, పట్టుకోకూడని ప్రదేశాలలో వారిని పట్టుకోవడం చేస్తున్నారు

  • నిబంధనలను ఉల్లంఘించి వస్తున్న మహిళను అడ్డగించింనచో మగవారు వచ్చి మహిళా పోలీసు సిబ్బందిని దూషిస్తూ, పట్టుకోరాని చోట పట్టుకొని విధులు నిర్వర్తించనీయకుండా నెట్టివేస్తున్నారు.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు