అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ గత 22 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రాజధాని గ్రామాల రైతులు తొలిసారి మంత్రిని కలిశారు. మంత్రి పేర్ని నానితో రాజధాని ప్రాంత రైతులు భేటీ అయ్యారు. తమకి న్యాయం చేయాలని మంత్రిని కోరారు. రాజధాని రైతులకు సీఎం జగన్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారని పేర్ని నాని వారికి హామీ ఇచ్చారు. గతంలో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారని, మరిసారి నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. రైతులు చంద్రబాబుతో చర్చలు ఆపి.. ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. రైతులకు ఏమి కావాలో ప్రతిపాదనలతో వస్తే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.