రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టంచేశారు.ss రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇవే కాకుండా వారికి ఏమైనా సమస్యలుంటే చెప్పాలని, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామనిభరోసా ఇచ్చారు. రైతులకు సంబంధించిన ఎలాంటి అంశాన్నైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలోని రాయపూడి, మందడం, లింగయ్యపాలెం, మల్కాపురం తదితర గ్రామాలకు చెందిన రైతులు మంత్రిని విజయవాడలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భూముల క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షల కారణంగా, ఇంట్లో పెళ్లిల్లు, ఇతరత్రా అవసరాలకు, భూములను అమ్మలేక పోతున్నామని, ఫలితంగా ఆర్ధికపరమైన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా రైతులు మంత్రికి వివరించారు. అంతే కాకుండా లంక ప్రాంతాల్లోని భూముల సమస్యలను కూడా ప్రస్తావించారు.
దాదాపు అరగంటపాటు ఈ సమావేశం కొనసాగింది. అసైన్డ్ భూముల విక్రయాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. అలాగే అభివృద్ధి పనులకు వినియోగించని, తమ భూములను తిరిగి ఇచ్చే ఆలోచన చేయాలని రైతులు విజ్ఞప్తి sచేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Botsa satyanarayana, S