Home /News /politics /

AMARAVATI FARMERS FULL HAPPY TO PM MODI DECISION AND RECENTLY AMIT SHAH ALOS SAID TO SUPPORT AP CAPITAL PROTEST NGS GNT

Amaravati Farmers: మోదీ నిర్ణయంతో అమరావతి రైతుల్లో ఫుల్ జోష్.. మొన్న అమిత్ షా.. నేడు మోదీ.. బీజేపీ పెద్దల ప్లాన్ ఇదే..

అమరావతి రైతలు జోష్

అమరావతి రైతలు జోష్

Amaravati Farmers: అమరావతి రాజధాని రైతులకు అనూహ్యంగా బలం పెరిగింది. తమ పోరాటం విజయవంతం అవుతోందనే అభిప్రాయం వచ్చింది. తాజాగా ప్రధాని మోదీ నిర్ణయం.. మొన్న అమిత్ షా చెప్పిన మాటలతో.. విజయం సాధిస్తామనే నమ్మకం రెట్టింపు అయ్యింది. ప్రధాని నిర్ణయంతో అమరావతి రైతులకు ఏం సంబంధం?

ఇంకా చదవండి ...
  అన్నా రఘు, న్యూస్ 18 ప్రతినిధి, అమరావతి.                              Amaravati Farmers:  భారత ప్రధాని మోదీ (PM Modi) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.  గత కొన్ని నెలలుగా రైతుల చేస్తున్న పోరాటాన్ని గుర్తించి .. తాము తీసుకొచ్చిన  వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు.  ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతి (Amaravati) ఉద్యమకారుల్లో నూతన ఉత్సాహం మొదలైంది. ఎందుకంటే వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని కేంద్ర ప్రభుత్వం (Central Government) పదే పదే చెబుతూ వచ్చింది. రైతుల పోరాటలను కూడా లైట్ తీసుకుంది. దీంతో వ్యవసాయ చట్టాలు రద్దవ్వడం కష్టమే అనుకున్నారు అంతా.. కానీ రైతుల సుదీర్ఘ పోరాటంతోనే (farmers protest)  వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని అమరావతి రైతులు భావిస్తున్నారు.  రైతుల విషయంలో కేంద్రమే వెనుక అడుగు వేసినప్పుడు.. తాము కూడా సుదీర్ఘ పోరాటం చేస్తే రాష్ట్రం ప్రభుత్వం (AP Government) కూడా వెనక్కు తగ్గుతుందని ధైర్యం వచ్చింది అంటున్నారు...

  రైతుల ఆలోచన ఏదైనా.. అనూహ్యంగా మోదీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటనే చర్చ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్రం హోం మంత్రి అమిత్ షా సైతం.. స్థానిక బీజేపీ నేతలకు క్లాస్ పీకారు.. అమరావతి రైతలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని మండిపడ్డట్టు తెలుసింది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని తీర్మానం చేసిన తరువాత ఎందుకు.. రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  మధ్యలో ఏపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తే గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం..

  ఇదీ చదవండి : ఆ జంట పరిచయం ఖరీదు కోటి రూపాయాలు.. చివరికి ఏం జరిగిందంటే..?

  అమరావతి రైతులకు మద్దతివ్వాలని అమిత్ షా మొన్న తిరుపతి అన్నారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. అంటే రైతులు వచ్చే ఎన్నికల నాటికి తమ వెంటనే ఉండేలా చేయాలన్నది కేంద్రం పెద్దల ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇటీవల ఎన్నికల ఫలితాలు.. త్వరలో కీలక ఎన్నికల ఫలితాలపై  సర్వేలతో బీజేపీ పెద్దలు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..

  ఇదీ చదవండి : సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ సెగలు.. అందాల ఆరబోతతో కవ్విస్తోన్న దేత్తడి హారిక

  బీజీపీ పెద్దల మనసులో ఏమున్నా.. కేంద్రం నిర్ణయం మాత్రం అమరావతి రైతుల్లో ఉత్సహం నింపింది. తమ పోరాటంలో న్యాయం ఉందని.. కేంద్రం పై రైతుల పోరాటం లాగే తాము కూడా సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నామని భావిస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు రెండు మద్దతుగా ఉన్నాయి. దీనికి తోడు న్యాయస్థానాలు సైతం అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా తీర్పులు ఇస్తోంది. దీంతో కచ్చితంగా రాష్ట్ర ప్రభతత్వం వెనక్కు తగ్గాల్సింది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది.

  ఇదీ చదవండి : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం..

  ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో రాజధానిగా అమరావతికి మద్దతు ప్రకటించారు. ఇక అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని మరో సింగపూర్ చేస్తామని..  హామీ ఇచ్చారు. రాష్ట్రానికి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. రాజధాని డవెలప్ అయితే.. తమ బిడ్డల భవిష్యత్తు బాగుటుందనే మంచి సంకల్పంతో అమరావతి రైతులు.. తమ భూములను ప్రభుత్వానికి ఇఛ్చారు.

  ఇదీ చదవండి : వరద బాధితుల కోసం బస్తాలు మోసిన ఎమ్మెల్యే.. రాయల చెరువుకు ముప్పు తప్పిందా..?

  కానీ జగన్ సీఎం అయిన తరువాత కొత్తగా తెరపైకి మూడు రాజధానుల ఫార్ములా తీసుకొచ్చారు. అది కార్యరూపం దాలిస్తే.. విశాపట్నం పరిపాలనా రాజధానిగా  మారుతుంది. దీంతో అమరావతి రైతుల మత సంగతి ఏంటి అని నిలదీస్తుతన్నారు. గత ప్రభుత్వం.. అప్పటి ప్రతిపక్ష నేతగా.. ఇప్పటి సీఎం అంగీకరిస్తేనే తాము భూములు ఇచ్చామని.. ఇప్పుడు నమ్మించి గొంతు కోస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

  ఇదీ చదవండి : ఏపీని వదలని వానలు.. ఆ మూడు జిల్లాలపై వరుణుడి పగ.. నేడు మరో అల్పపీడనం..

  రైతులు  ఎన్నిసార్లు ప్రశ్నించినా రాష్ట్ర ప్రభుత్వం లైట్ తీసుకుంటోంది. అసలు రాజధాని రైతులకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. దీంతో అమరాతి రైతులు ఉద్యమాన్ని రోజు రోజుకూ తీవ్రతరం చేస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతిని కాపాడుకుంటా అనే నినాదంతో 700 రోజలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.  తాజాగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్రం చేపట్టింది. ఈ పాద యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పించింది. కల్పిస్తూనే ఉంది. ఆంక్షల పేరుతో పాద యాత్రను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. అయినా అమరావతి రైతుల అడుగులు ముందుకే పడుతున్నాయి.

  ఇదీ చదవండి : వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. ఎందుకో తెలుసా..?

  ఇలాంటి సమయంలో మొన్న అమిత్ షా వచ్చి అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని బీజేపీ నేతలకు క్లాస్ పీకడం.. తాజాగా ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయమనడం.. రెండు అంశాలకు రైతలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. కేంద్రం అండగా ఉంటే.. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని రాజధాని రైతులు  లెక్కలు వేసుకుంటున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amaravathi, Amit Shah, Andhra Pradesh, AP News, Pm modi

  తదుపరి వార్తలు