Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    జగన్‌కు షాక్... కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్

    ర్నూలుకు ఇటీవలే పలు కార్యాలయాల్ని తరలిస్తూ అర్థరాత్రి జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

    news18-telugu
    Updated: February 3, 2020, 12:09 PM IST
    జగన్‌కు షాక్... కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    ఇప్పటికే మూడు రాజధానులపై వరుస ఆందోళనలో తమ నిరసనలు తెలుపుతున్న అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చారు. కర్నూలుకు ఇటీవలే పలు కార్యాలయాల్ని తరలిస్తూ అర్థరాత్రి జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్‌, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు.

    ఇటీవలే కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంలో ఎలాంటి తప్పులేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలును ఏపీ జ్యూడీషియల్ క్యాపిటల్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... అందుకు తగ్గట్టుగానే కార్యాలయాలను తరలిస్తోందని ఆయన వివరించారు. న్యాయశాఖకు చెందిన కార్యాలయాలు, ట్రిబ్యూనల్స్‌ను కర్నూలుకు తరలిస్తున్నామని ఆయన వివరించారు. అయినా ఇదేమీ కొత్త విషయం కాదని... గతంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే అంశంతోనే తాము ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.
    Published by: Sulthana Begum Shaik
    First published: February 3, 2020, 12:09 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading