Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    అమరావతి ఆందోళనల్లో విషాదం.. రైతు మృతి

    కాసేపటి క్రితమే కొమ్మినేని మల్లిఖార్జునరావు మృతిచెందాడు. అతడి స్వస్థలం దొండపాడు. గత 17 రోజులుగా ఆయన నిరసన కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు.

    news18-telugu
    Updated: January 4, 2020, 2:57 PM IST
    అమరావతి ఆందోళనల్లో విషాదం.. రైతు మృతి
    రైతు మల్లిఖార్జునరావు
    • Share this:
    గతకొన్ని రోజులుగా రాజధాని విషయంలో అమరావతిలో ఆందోళను జరుగుతున్న విషయం తెలిసింది. అయితే ఇవాళ అక్కడ నిర్వహిస్తున్న రైతుల నిరసనల్లో విషాదం చోటు చేసుకుంది. మల్లికార్జున  రావు అనే రైతు మనో వేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. అమరావతిని తరలించవవద్దంటూ చేస్తున్న ధర్నాల్లో మల్లికార్జున రావు చురుకుగా పాల్గొన్నారు. అయితే నిన్న బోస్టన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌తో మరింత ఆవేదనకు లోనయ్యాడు.దీంతో గుండెపోటుతో కాసేపటి క్రితమే కొమ్మినేని మల్లిఖార్జునరావు మృతిచెందాడు. అతడి స్వస్థలం దొండపాడు. గత 17 రోజులుగా ఆయన నిరసన కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. అమరావతి కోసం మల్లికార్జునరావు పది ఎకరాల భూమి కూడా ఇచ్చారు. దీంతో రైతు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైతు మృతి పట్ల తుళ్లూరు నిరసన దీక్షల్లో రెండు నిమిషాలు మిగిలిన రైతులు మౌనం పాటించారు.

    Published by: Sulthana Begum Shaik
    First published: January 4, 2020, 1:24 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading