జగన్‌కు ఓటు వేసినందుకు రెండు చెంపలు పగిలాయన్న వైసీపీ కార్యకర్త

ఇక్కడ టీడీపీ కోసం పనిచేసిన వారికి ఒక్క చెంప పగిలింది.. కానీ మాకు మాత్రం రెండు చెంపలు పగిలాయన్నారు కిషోర్. జగన్‌ను కలుద్దామంటే మాకు అవకాశం రాలేదన్నారు. ఒక ఛాన్స్ ఇస్తే గనుక ఆయన కాళ్లపై పడి తమ బాధను, గోడును వెళ్లబోసుకుంటామన్నారు.

news18-telugu
Updated: February 3, 2020, 3:47 PM IST
జగన్‌కు ఓటు వేసినందుకు రెండు చెంపలు పగిలాయన్న వైసీపీ కార్యకర్త
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • Share this:
అమరావతిలో ఓ వైసీపీ కార్యకర్త ఆవేదనపై టీడీపీ తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. జగన్‌ను ఎంతగానే నమ్మిన తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ వైసీపీ కార్యకర్త. వెలగపూడికి చెందిన జొన్నలగడ్డ కిషోర్ అనే యువకుడు. వైసీపీ గెలుపునకు వెలగపూడి వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశానన్నారు. తుళ్లూరు మండలం తాడికొండ నియోజకవర్గంలో ఉండవల్లి శ్రీదేవి విజయం కోసం క్రీయాశీలకంగా పనిచేశామన్నారు. జగన్ వెంట కూడా తిరిగామన్నారు. మా ఇంట్లోవాళ్లు, మాఊరివాళ్లు కూడా జగన్ వస్తే... ఎంతగానే అభివృద్ధి చేశాడని భావించారు. తమను అడిగిన వాళ్లకు కూడా ఇదే చెప్పామన్నారు. ఆయనకు ఎవరో సలహా ఇచ్చారో కానీ... ఈరోజు మూడు రాజధనానుల ప్రకటనతో ఇప్పుడు మేం ఏం చేయాలో తెలియని ..కోలుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఇక్కడ టీడీపీ కోసం పనిచేసిన వారికి ఒక్క చెంప పగిలింది.. కానీ మాకు మాత్రం రెండు చెంపలు పగిలాయన్నారు కిషోర్. జగన్‌ను కలుద్దామంటే మాకు అవకాశం రాలేదన్నారు.  ఒక ఛాన్స్ ఇస్తే గనుక ఆయన కాళ్లపై పడి తమ బాధను, గోడును వెళ్లబోసుకుంటామన్నారు.

తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తమ బాధను అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారన్నారు. మా బాధను అర్థం చేసుకోకుండా మన పార్టీ అయి ఉండి దీక్షలు, ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు జగన్ రాజధానిపై తనకే హామీ ఇచ్చారన్నారు. తమ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రాజధాని మార్పుపై జగన్‌ను అడిగామన్నారు. దానికి ఆయన తమకు స్పష్టత ఇచ్చామన్నారు. తాను రాజధానిలో ఇళ్లు కట్టుకున్నానని... ఎవరైనా అడిగితే ఇదే చెప్పండని అప్పట్లో జగన్ అన్నారన్నారు. చంద్రబాబు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారో ఆయనను వెళ్లి అడగండి అంటూ జగన్ చెప్పుకొచ్చారన్నారు. పతీవ్రత అని రోజూ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో కూడా తాను ఇదే చెప్పానని అప్పట్లో జగన్ గుర్తు చేశారన్నారు వైసీపీ కార్యకర్త కిషోర్.First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు